అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి బోలెడు జాగ్రత్తలు తీసుకుంటాం. అది శరీరానికి. మరి మన మెదడుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి బోలెడు జాగ్రత్తలు తీసుకుంటాం. అది శరీరానికి. మరి మన మెదడుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అరవై ఏళ్లు దాటిన కొందరికి ఈ మధ్య అల్జీమర్ అనే వ్యాధి భూతంలా కనిపించి భయపెడుతున్నది. దాని బారినుంచి తప్పించుకోవాలంటే ఐదు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు పరిశోధకులు.

- మతిమరుపు మన జోలికి రాకుండా ఉండాలంటే ఏదో ఒక కొత్త భాష నేర్చుకోవాలి. అప్పుడు మెదడుకి పని పెరిగి చురుగ్గా ఉంటుందంటున్నారు.

- స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు తింటుండాలి. అమెరికాలో 16 వేలమందిపై చేసిన పరిశోధనలో బెర్రీలు ప్రతి రోజూ తిన్నవారి మెదడు చాలా ఆరోగ్యంగా ఉందని తేలింది.

- వయసుమళ్లిన వారికి రోజూ వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. వాకింగ్‌లు, జిమ్‌లు వంటి సౌకర్యాలు అందరికీ ఉండవు కాబట్టి ఇంటి పని చేసుకుంటే మంచిదంటున్నారు. దీని కోసం ఎనభైఏళ్ల వయసుదాటిన 700 మందిపై చేసిన పరిశోధనలో ఇంటిపని చేసుకునేవారి మెదడు చురుకుగా ఉన్నట్టు చెబుతున్నారు.

- ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

- మీరు తినే ఆహారంలో అప్పుడప్పుడు బ్రొకోలీ ఉండేలా చూసుకోవాలి. ఇది మెదడులోని కణాలు దెబ్బతినకుండా చూస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top