అరటికాయ పేస్టు రెండు స్పూన్లు, టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఓట్స్, బాదం పొడి, తేనె సమపాళ్లలో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేపి పూర్తిగా ఆరిన తర్వాత చన్నీటితో కడిగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

