అకస్మాత్తుగా మరణాన్ని తెచ్చిపెట్టే అంశాల్లో గుండెపోటు ఒకటి. దీన్ని అత్యంత తేలిగ్గా నివారించడానికి అనేక పరిశోధనలు, అధ్యయనాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. వాటి అధ్యయన ఫలితాల ప్రకారం కొన్ని తేలికైన మార్గాలివి....
మీకు కీవీ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే తరచూ తినండి. కీవీ ఫ్రూట్స్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను సమర్థంగా 15 శాతం తగ్గించగలదు. ఒక మందులా రక్తాన్ని పలచబార్చేందుకు ఆస్పిరిన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో... మందు కాకపోయినా కీవీ పండు కూడా అలాంటి ఫలితాలను ఇస్తుందని ఓస్లో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఎముకలు ఆరోగ్యంగా ఉన్నవారిలో గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది గుండెపోటుకు గురవుతుంటారు. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోడానికి క్యాల్షియమ్ పుష్కలంగా తీసుకోవడం అవసరమని జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ పేర్కొంది. క్యాల్షియమ్ కోసం రోజూ కనీసం 200 ఎం.ఎల్. పాలు తాగడం ఒక తేలికైన మార్గం.
కొవ్వులేని పాలతో తోడేసిన పెరుగు తినడం మంచిది. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే వెనిల్లా ఫ్లేవర్‌తో లభ్యమయ్యే యోగర్ట్ తింటే... అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారిస్తాయని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సెన్సైస్ పేర్కొంటోంది.