ఒక రంగుకు ఆ పండు పేరే ఇచ్చారు. అంతటి గౌరవం దక్కిన ఆ పండే... నారింజ. సిట్రస్ జాతికి చెందిన ఈ పండులో వైటమిన్-సి పుష్కలంగా ఉంటుందని, ఆ వైటమిన్‌ను ఆస్కార్కిబ్ ఆసిడ్ అంటారన్న విషయం తెలిసిందే. వైటమిన్-సి స్కర్వీ వ్యాధి, జలుబు నివారణతో పాటు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుందన్న విషయం కూడా తెలిసిందే. స్కర్వీ ప్రధాన లక్షణమైన చిగుళ్ల నుంచి రక్తస్రావం కాకుండా ఆపడంలో వైటమిన్-సి దోహదపడుతుంది.
నారింజ పండుతో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో కణాలు ఒక దానితో మరొకటి పట్టి ఉంచే కొలెజెన్ ఉత్పత్తికి ఇది దోహదం చేస్తుంది. అందుకే వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడకుండా చూసే యాంటీ-ఏజింగ్ గుణాలు దీనికి ఉన్నాయి.
ఇందులో ఆరోగ్యాన్ని కాపాడుతూ, రోగ నిరోధశ శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్, 170కి పైగా అనేక పోషకాలు (ఫైటో న్యూట్రియెంట్స్) ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి...
లిమొనాయిడ్స్:
ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. కాబట్టి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు నారింజలు తింటే... వాటిలోని లిమొనాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి తోడ్పడతాయి. పైగా లిమొనాయిడ్స్‌కు యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి.
పాలీమిథాక్సిలేటెడ్ ఫ్లేవాన్స్ (పీఎమ్‌ఎఫ్స్):
నారింజల్లోనే కాదు... దాని తొక్కలోనూ ఎన్నో విలువైన పోషకాలు ఉన్నాయి. ఉదాహరణకు నారింజ తొక్కలో పాలీమిథాక్సిలేటెడ్ ఫ్లేవాన్స్ అనే పోషకం అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే సలాడ్స్ తీసుకునేవారు... నారింజ తొక్కను కూడా బాగా కడిగి సన్నగా తరిగిన ముక్కలను తీసుకోవడం మంచిదన్నది పరిశోధకుల సలహా. ఇష్టమైతే నారింజ జ్యూస్‌లోనూ సన్నగా తరిగిన కొన్ని తొక్కముక్కలు వేసుకోవడం శ్రేయస్కరం.
బీటా క్రిప్టోగ్జాంథిన్:
ఇది ఒకరకమైన కెరోటినాయిడ్. అంటే రంగును ఇచ్చే పదార్థం అన్నమాట. నారింజకు ఆ రంగు దీని వల్లనే వస్తుంది. ఇందులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించే గుణం చాలా ఎక్కువ. చైనాలో 60,000 మందికి పైగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలిన విషయం పరిశోధకులకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. నారింజ పండు రూపంలో బీటా-క్రిప్టోగ్జాంథిన్ తీసుకునేవారిలో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మిగతా వాళ్లతో పోలిస్తే 27% తక్కువగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.
జియాగ్జాంథిన్:
ఇది కూడా ఒక రకం కెరోటినాయిడ్. ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. నారింజ పండు ద్వారా జియాగ్జాంథిన్ తీసుకునేవారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు మిగతా వాళ్లతో పోలిస్తే 52% తగ్గినట్లుగా ఒక అధ్యయనంలో తెలిసింది.

మిగతా పండ్లలో ఉండే చక్కెర వేగంగా విడుదల అవుతుందేమోగాని... నారింజ పండు తిన్నవారిలో దీనివల్ల లభ్యమయ్యే చక్కెర చాలా మెల్లగా శరీరంలోకి విడుదల అవుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ (కేవలం 44 మాత్రమే). అందుకే ఇది చక్కెరవ్యాధి గ్రస్తులకు కూడా సురక్షితమైన పండు అని చెప్పవచ్చు. అందుకే ఇన్ని ప్రయోజనాలు ఉన్న నారింజను నిశ్చింతగా తినండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.
|