రక్తహీనతను నివారించడానికి ఆహారంలో ఐరన్ పాళ్లు ఎక్కువగా ఉంటే పదార్థాలు... అంటే... మాంసాహారంలోని కాలేయం వంటి అవయవాలు, శాకాహారంలో చిక్కుళ్లు, సోయాబీన్స్, కందులు, ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), నట్స్, డ్రైఫ్రూట్స్, ఖర్జూరం, బెల్లం, రాగులు వంటి వాటితో సమతుల ఆహారం తీసుకోవాలి. గుడ్లు కూడా తీసుకోవాలి.

