కాలిన గాయాలకు...ఇంట్లో చేసుకొనే ప్రాధమిక చికిత్సలు

వంట, ఇస్త్రీ చేసే సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా చేతులు కాలతాయి. మరీ ఎక్కువ కాలితే వైద్య సహాయం తీసుకోవాలి. సాధారణ గాయాలకు.. 

కాలిన వెంటనే ఆ భాగంలో బాగా చల్లని నీరు పోస్తూ ఉండాలి. 

కాలిన భాగంలో దుస్తులు, ఆభరణాలు ఉంటే తీసేయడం మంచిది. వీటి వల్ల స్వెల్లింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. 

వెన్న, నెయ్యి, నూనె, గ్రీజ్... వంటి పదార్థాలు కాలిన గాయాలపై పూయకూడదు. నూనె పదార్థాలపై పడే దుమ్ము కణాలు ఇన్ఫెక్షన్‌కు కారణం అవ్వచ్చు. 

కాలిన కొన్ని గంటల తర్వాత చిన్న గాయం అయితే... ఆ భాగంలో అలొవెరా ఆకును మధ్యకు విరిచి, ఆ జెల్‌ను కొద్దిగా అప్లై చేయవచ్చు. కాలిన భాగం చర్మం చాలా సెన్సిటివ్‌గా మారుతుంది. అందుకని మార్కెట్లో లభించే అలొవెరా బాటిల్‌లోని జెల్‌ను ఇందుకోసం ఉపయోగించరాదు. వీటిలో ఉండే రసాయనాల వల్ల ఇరిటేషన్ సమస్యలు తలెత్తవచ్చు. 

కాలినగాయాన్ని పది పదిహేను నిమిషాలు చల్లని పాలలో (వెన్నలేనివి) మునిగేంత వరకు ఉంచితే ఉపశమనంగా ఉంటుంది. 

కాలిన గాయం తాలూకు మచ్చ పోవాలంటే.. బొప్పాయి గుజ్జు మేలైన ఔషధంగా పనిచేస్తుంది. 

పుదీనా ఆకులను గుజ్జు చేసి, రసం తీయాలి. ఈ రసాన్ని రాస్తే కాలడం వల్ల అయిన మచ్చలు తగ్గుముఖం పడతాయి. 

టొమాటోను సగానికి కోసి, ఆ ముక్కతో మచ్చపై రాస్తే చర్మం పూర్వపు రంగులోకి వచ్చే అవకాశం ఉంది.

బంగాళదుంప ముక్కతో మచ్చపై రాసినా, కాలిన గాయం వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top