ఏ అవయవం కోసం ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందామా ....

మెదడు కోసం... వాల్‌నట్ 
వాల్‌నట్ చూడటానికి అచ్చం మెదడులాగానే ఉంటుంది. మెదడులోని ముడుతలను పోలి దీని నిర్మాణం ఉంటుంది. ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పాళ్లు చాలా ఎక్కువ. ఇవి మెదడులోని కణాలు చురుగ్గా పనిచేసేలా, న్యూరాన్ల మధ్య సమాచారం వేగంగా జరిగేలా చూస్తాయి. అందుకే మన జ్ఞాపకశక్తి బాగా ఉండి, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం, నరాల మెరుగైన ఆరోగ్యం కోసం వాల్ తినడం చాలా మంచిది. 

ఓవరీ ఆరోగ్యం కోసం ఆలివ్
మహిళల్లో ఓవరీస్ చూడ్డానికి అచ్చం ఆలివ్ పళ్లలాగే ఉంటాయి. ఒక ఇటాలియన్ అధ్యయనం ప్రకారం నిత్యం ఆలివ్ ఆయిల్ వాడే మహిళల్లో మిగతా సాధారణ స్త్రీలతో పోలిస్తే క్యాన్సర్ వచ్చే రిస్క్ 30 శాతం తగ్గుతుందని తేలింది. దీనికి గల కారణాలు ఇంకా నిర్దిష్టంగా తెలియనప్పటికీ ఈ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్లనే ఇది సాధ్యమవుతోందని శాస్త్రవేత్తల అంచనా. ఆలివ్ నూనె వాడేవారిలో అది క్యాన్సర్ జన్యువులను అణగదొక్కుతుందని కొందరు పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 

కన్ను కోసం: క్యారట్
క్యారట్‌ను అడ్డుగా కోసి చూడండి. అది అచ్చం కన్నులోని నల్లగుడ్డు ఆకృతి (ప్యూపిల్ అండ్ ఐరిస్) ఉంటుంది. క్యారట్‌లోని బీటా కెరోటిన్ నుంచే కంటి ఆరోగ్యానికి దోహదపడే విటమిన్-ఏ వస్తుంది. కంటిలో ఉండే కార్నియా కణాల ఆరోగ్య నిర్వహణ కోసం కూడా విటమిన్ ఏ చాలా మంచిది. (కార్నియా ఒక పారదర్శకమైన పొర. ఇది అనేక సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్, దుమ్ము, ధూళి వంటి సమస్యలను కంటిని కాపాడుతుంది.) 

గుండె కోసం... ద్రాక్ష
ఒక ద్రాక్ష గుత్తిని దూరం నుంచి చూస్తే అది అచ్చం గుండె ఆకృతిలోనే కనిపిస్తుంటుంది. కొంతమేరకు ద్రాక్షకు ఉండే పర్పుల్ రంగుతో గుండెకాయ రంగుకు దగ్గరదగ్గరగా ఉంటుంది. ద్రాక్షలోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్లేవనాయిడ్స్ గుండెజబ్బులను నివారించడంలో తోడ్పడతాయి.

ప్యాంక్రియాస్ కోసం...చిలగడదుంప
చిలగడదుంప ఆకృతి అచ్చం ప్యాంక్రియాటిక్ గ్రంథినే పోలి ఉంటుంది. చిలగడదుంప రక్తంలో చక్కెర విడుదలను నియంత్రించడానికి పనిచేస్తుంది. అందుకే చిలగడదుంపకు స్వీట్ పొటాలో అన్న పేరున్నా సరే... స్వీట్ తినకూడని చక్కెర వ్యాధిగ్రస్తులు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. 

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కోసం బొప్పాయి...
బొప్పాయి నిలువుకోత అచ్చం కడుపు కుహరంలా పోలి ఉండడం వల్ల బొప్పాయితో జీర్ణ కోసం వ్యవస్థ మెరుగుపడు తుందనేది నిపుణుల మాట. మన జీర్ణక్రియ జరిగే మార్గమంతా ఒక మెత్తటి కుంచెతో శుభ్రం చేసినట్లుగా ఉండాలంటే రోజూ ఉదయం భోజనానికి ముందుగా ఒక బౌల్ లేదా రాత్రి భోజనం తర్వాత ఒక బౌల్ బొప్పాయి పండ్లు తినాలి.

ఎముకల నిర్మాణానికి కాల్షియం దోహదపడుతుంది. ఆ కాల్షియం మునగలో ఎక్కువ. మునగాకులో మరీ ఎక్కువ. అన్ని రకాల ఆకుకూరలతో పాటు పాలకూరలో కాల్షియం ఎక్కువే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top