మీరు ఫిట్‌నెస్‌ గా ఉన్నారా ?


- ఒకరు రోజులోని ఏ సమయంలోనైనా పది నిమిషాల పాటు ఆగకుండా తేలిగ్గా పరుగెత్తడం చేయగలిగితే వారు ఫిట్‌నెస్‌తో ఉన్నట్లే. అయితే ఇలా చేసే సమయంలో ఆ పనిని శ్రమతో కాకుండా, సునాయాసంగా చేయగలగాలి. ఆ టైమ్‌లో మరీ ఎక్కువగా ఆయాసపడకూడదు.

- రోజువారీ పనులన్నీ చురుగ్గా, హుషారుగా చేసుకోగలగాలి.

- సాయంత్రానికి ఏదైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే (అంటే టెన్నిస్ ఆడటం లేదా ఎక్కడికైనా బయటకు వెళ్లడం) అలిసిపోయాననే సాకు చెప్పకుండా వెళ్లగలగాలి.

- అనుకోని ఘటన (అన్‌ఫోర్‌సీన్ ఇన్సిడెంట్) ఏదైనా జరిగినప్పుడు అలసటను సాకుగా తీసుకోకుండా దాన్ని చక్కదిద్దేందుకు ఉపక్రమించగలగాలి.

పై నాలుగు అంశాలను చేయగలిగేవారు... ఒకింత లావుగా ఉన్నా, కాస్త సన్నగా ఉన్నా ఫిట్‌నెస్‌తో ఉన్నట్లే. వారు తమ లుక్స్ గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. అయితే దైనందిన వ్యవహారాలకు ఆటంకం కలిగేటంతగా ఎక్కువ లావుగా ఉన్నవారు లేదా చూడ్డానికే బాగాలేనంత (అనారోగ్యంగా కనిపించేలా) సన్నగా ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి తమ ఫిట్‌నెస్ పెంపొందించుకోవడం కోసం అనుసరించాల్సిన కార్యకలాపాలను చేపట్టాలి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top