రోజూ కాకుండా అప్పుడప్పుడూ తీసుకునే చాక్లెట్ మిల్క్‌షేక్... గుండెజబ్బుల రిస్క్‌ను తగ్గించుకునే ఒక రుచికరమైన మార్గం. చాక్లెట్‌లోని కోకోలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం రక్తనాళాలు గరుకుగా మారి రక్తం గడ్డగట్టే గుణాన్ని (అథెరోస్క్లీరోసిస్ను) తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బార్సెలోనా పరిశోధకులు చెబుతున్నారు.