పిల్లలు రాత్రిపూట పక్కతడపకుండా ఉండాలంటే...

ఇది పిల్లలో కనిపించే సాధారణ సమస్య. దీనిని ఆయుర్వేద పరిభాషలో ‘శయ్యామూత్రం’ అంటారు. దీనికి సుస్పష్టమైన కారణం కనిపించకపోయినా, అంతర్లీనమైన మానసిక ఒత్తిడే ప్రధానాంశం. నేటి జీవనశైలిలో ఈ ఒత్తిడిని బాగా పెరుగుతోంది. అవగాహనలేని తల్లిదండ్రులు, పాఠశాలలకు సంబంధించి పుస్తకాల భారం, ఉపాధ్యాయులు విధించే శిక్షలు మొదలైనవి. పక్క తడిపినప్పుడు పిల్లలు బాధపడతారు. కాని నియంత్రించుకోలేరు.

చికిత్స: తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మెలగాలి. అన్ని విషయాలను అర్థమయ్యేలా నచ్చచెప్పాలి.

పక్కతడిపే విషయంలో... వారిని తిట్టడం, కసురుకోవటం, దండించడం వంటివి చేస్తే సమస్య ఎక్కువవుతుందే గాని తగ్గదు. 

పిల్లలకు ఆత్మవిశ్వాసం పెరిగేట్టు చేయాలి. ఈ సమస్య చాలామందిలో ఉంటుందనీ, క్రమేపీ తగ్గిపోతుందనీ, దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదనీ వివరించి, వారికి ధైర్యం చెప్పాలి. రాత్రిపూట 7 గంటలకే భోజనం పెట్టాలి. ద్రవాలు, పానీయాలు తక్కువగా ఇవ్వాలి. పడుకున్న ఒక గంట తరవాత పాపని/బాబుని నిద్రలేపి బాత్‌రూమ్‌కి తీసుకెళ్లి, మూత్రవిసర్జన చేయించాలి. ఆ తరవాత రెండు గంటల పిమ్మట మళ్లీ చేయించాలి. ఈ విధంగా చేస్తే క్రమక్రమంగా ఈ అలవాటు తగ్గిపోతుంది.

మందులు: సారస్వతారిష్ట, అరవిందాసవ ద్రావకాలను ఒక్కొక్క చెంచా, రెండు చెంచాల నీళ్లు ఒక కప్పులో పోసి, కలిపి రెండుపూటలా తాగించాలి చంద్రప్రభావటి (మాత్రలు) ఉ 1 - రా 1. అవకాశం కుదిరితే, దొండపాదువేరుని దంచి, రసం తీసి, ఒక చెంచా రసంలో కొంచెం తేనె కలిపి రెండుపూటలా నాకించాలి.

సూచన: శారీరక వ్యాయామం (ఆటలు ఆడటం) , ప్రాణాయామం సమకూర్చాలి. దీన్ని అమలుపరచడం పెద్దల బాధ్యత. మానసిక ఒత్తిడి ప్రేరణకు సంబంధించి నిర్దిష్టమైన కారణం కనబడితే, దానిని తగ్గించటానికి కృషిచేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top