నిద్రలో పిక్కలు పట్టేస్తే...?


నిద్రలో అకస్మాత్తుగా పిక్కలు పట్టేయడం చాలామందికి ఒక బాధాకరమైన అనుభవం. దాంతో అకస్మాత్తుగా నిద్రలేచి బాధతో విలవిలలాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆ రోజున వాళ్లు తగినన్ని నీళ్లు తాగకపోవడం, పైగా వాళ్లు తీసుకున్న ఆహారంలో తగినన్ని లవణాలు, ఖనిజాలు (ముఖ్యంగా సోడియం, క్యాల్షియం, పొటాషియమ్ వంటివి) తగ్గడం ఇలా పిక్కలు పట్టేయడానికి ఒక కారణం.

ఇలా జరిగినప్పుడు ఆందోళనకు గురికాకుండా... పట్టేసిన పిక్కల్లో కండరాలు వదులయ్యేలా చేతితో మసాజ్ చేస్తున్నట్లుగా రాస్తూ... మెల్లగా నడవాలంటున్నారు ఇంగ్లాండ్‌కు చెందిన ఛార్టర్డ్ సొసైటీ ఆఫ్ ఫిజియోథెరపీకి చెందిన నిపుణురాలు ప్రియా దాసోజు. అలా చేస్తూ మెల్లమెల్లగా నడవడానికి ప్రయత్నిస్తే కాసేపట్లోనే పరిస్థితి చక్కబడుతుందని అంటారామె. దీంతోపాటు ఆ కొంచెం ఉప్పు కలిపిన మంచినీళ్లు లేదా కాస్త ఉప్పు కలిపిన నిమ్మకాయ నీళ్లు (ఫ్రెష్ లైమ్ జ్యూస్) తాగడంతో పాటు... పొటాషియమ్ ఎక్కువగా ఉండే ఒక అరటిపండు తింటే ఆ సమస్య వెంటనే రాదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top