రోజూ ఎన్నో రకాల ఒత్తిళ్ళతో సతమతమయ్యే మనకు ఒత్తిడిని జయించేందుకు మరో మార్గం

రోజూ ఎన్నో రకాల ఒత్తిళ్ళతో సతమతమయ్యే మనకు ఒత్తిడిని జయించేందుకు మరో మార్గం దొరికింది. అదే ఫ్లూట్ యోగా లేదా బన్సీ యోగా. దీనితో ఎన్నో రకాల ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ వారు. వీరు సాంప్రదాయక యోగా విధానాన్ని, వేణునాదాన్ని మిశ్రమం చేశారు. 

దీని ప్రకారం ఒక క్రమపద«్ధతిలో వేణునాదానికి అనుకూలంగా కాళ్ళను, చేతులను, ఇతర శరీర భాగాలను ఆడిస్తూ 40 నిమిషాల పాటు యోగా సాధన చేయాలి. దీన్నించి పొందిన ఫలితం ఎనిమిది గంటల నిద్రతో సమానమట. ఈ యోగా సాధన అనంతరం ఓంకారాన్ని పఠించడం వల్ల మన శరీరంలో మరింత శక్తి చేకూరి ఒత్తిడి దూరమవుతుందంటున్నారు ఈ ప్రక్రియను కనుగొన్నవారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top