నట్స్‌ను ఎలాగైనా తినవచ్చు. అయితే వాటి ప్రాధాన్యం ఏమిటి... వాటిలో ఏం ఉంటాయి... ఎప్పుడు ఎలా తింటే ఏయే ప్రయోజనాలు చేకూరతాయి...

చిరుతిండ్లు తినడం చాలామందికి అలవాటే. అయితే చిరుతిండ్ల కోసం ఎంచుకునే పదార్థాల్లో చాలావరకు రకరకాల కారా, స్వీట్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఆరోగ్య స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో చిరుతిండ్లు తింటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చూడాల్సింది నట్స్ వైపే. నట్స్‌ను ఎలాగైనా తినవచ్చు. అయితే వాటి ప్రాధాన్యం ఏమిటి... వాటిలో ఏం ఉంటాయి... ఎప్పుడు ఎలా తింటే ఏయే ప్రయోజనాలు చేకూరతాయి... అన్న వివరాలు మీకోసం... 

నట్స్ ప్రాధాన్యం: తక్కువ పరిమాణంలో ఉండి, కొద్దిసేపట్లోనే తినగలిగి ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు నట్స్. పర్వతారోహకులు, స్కీయింగ్ చేసే క్రీడాకారుల వంటి వారు తమతో నట్స్‌నే ఆహారంగా ఉంచుకుంటారు. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమించుకుని ఎక్కువ రుచికంగానూ, బలవర్థకంగానూ ఉండటం వల్ల వీటిని తమ ఆహారంలో ఎక్కువగా ఉపయోగించుకుంటుంటారు. 

బాదాంలో : ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. వైటమిన్-ఇ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదాం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్‌ఫ్లమేషన్ ఉంటే బాదాం తినడం మంచిది. అప్పుడు అందులోని ఒమెగా-3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. 

ఎప్పుడు తినాలి: వీటిని ఎప్పుడైనా తినవచ్చు. అయితే ముఖ్యంగా మనం డిన్నర్‌లో వేటమాంసం, రెడ్ మీట్ తిన్న తర్వాత కొన్ని బాదాములు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. 




పిస్తాలో : పిస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, ల్యూటిన్, జియాగ్జాంథిన్ అనే కెరొటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఎందుకు తినాలి: పైన పేర్కొన్న కెరొటినాయిడ్స్ కంటికి మంచిది. కంటిలోపల ఉండే రెటీనా పొర ఆరోగ్యాన్ని ఈ కెరొటినాయిడ్స్ కాపాడతాయి. ఒక కోడిగుడ్డులో ఎంత బలం ఉంటుందో... గుప్పెడు పిస్తా గింజల్లో అంతే బలం ఉంటుంది.
ఎప్పుడు తినాలి: పని చేసి అలసిపోయాక తక్షణ శక్తి కావాలనుకున్నప్పుడు వీటిని తినాలి. 

పల్లీలు: మనం పల్లీలను తరచూ తింటూనే ఉంటాం. పల్లీల్లో ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 

ఎప్పుడు తినాలి: మనం పిస్తాను పని తర్వాత తింటే... పల్లీలను ఏదైనా పనికి ఉపక్రమించే ముందు తినడం మంచిది. ఎందుకంటే ఇందులో కొద్దిపాటి కొవ్వు, బోలెడంత పీచు ఉండటం వల్ల పని చేయబోయే ముందర అవసరమైన శక్తిని ఇస్తుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top