పిల్లలకు పోషక పదార్థాలు ఉండే అల్పాహారం


  • ఒకకప్పు పెరుగు, పండుముక్క ఇవ్వచ్చు.
  • కూరగాయముక్కలతో ఆమ్లెట్‌ చక్కని ప్రత్యామ్నాయ ఉపాహారం.
  • చల్లని ఈ శీతాకాల ఉదయాలకు గ్రీన్‌ పరోటాలు ఎక్కువ మేలు చేస్తాయి. మెంతి ఆకులు ఇతర ఆకులేవైనా గోధుమపిండిలో వేసి కలిపి పరోటాలు చేసి పెడితే కలర్‌ఫుల్‌గా మాత్రమే కాదు, అత్యంత పోషకాలతో నిండి ఉంటాయి.
  • ఉదయం టోస్టు ఇష్టపడే పిల్లలకు హోల్‌మీల్‌ బ్రెడ్‌పై బట్టర్‌, జామ్‌ లేదా పీనట్‌బట్టర్‌ పరిచి ఇచ్చి, ఓ గ్లాసు పండ్లరసాన్ని ఇస్తే సరిపోతుంది. దీనిలో పోషకాలు, పీచు సమౄఎద్దిగా లభిస్తాయి. పీచు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నందున పిల్లలకు ఎక్కువసేపు పొట్టనిండుగా ఉండి పిచ్చి చిరుతిండ్ల వైపు చూడరు.
  • ఆరోగ్యవంతమైన మిల్‌‌కషేక్‌ చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ఉడకబెట్టినగుడ్డు, బాదంపప్పుకూడా మంచి ఉపాహారంలో భాగాలు.
  • ఇడ్లీ, పోహ, ఉప్మా బ్రేక్‌ఫాస్‌‌టకు ప్రత్యామ్నాయం.
  • పిల్లలకు బ్రేక్‌ప్రాస్ట్‌ కీలకమైన ఆహారం. పిల్లలు ఏం తినకుండా స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళిపోతే శరీరంలో గల శక్తినిల్వల్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిల్వశక్తి స్ట్రెస్‌ హార్మోన్‌ ద్వారా విడుదలవుతుంది. కాబట్టి పిల్లలు అలసటగా, విసుగ్గా, చిరాగ్గా మారిపోవడం మనం గమనిస్తాం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top