నడుంనొప్పి వచ్చినప్పుడు.....

నడుంనొప్పి వచ్చినప్పుడు - ఆ నొప్పి పెంచే పనులు ఏవైనా సరే మానడం మంచిది. వ్యాయామం కూడా నడుము నొప్పి పెంచుతున్నట్టయితే మానాలి. తలగడ మీద పడుకొని మోకాళ్ల దిగువన తలగడలు పెట్టు కొని పడుకోవాలి. పరుపు లేదా మంచం గట్టిగా ఉండాలి. అంతే కానీ శరీరం కుంగిపోయేలా ఉండరాదు.

పరుపు మెత్తగా ఉన్నట్లయితే దాని కింద ప్లయివుడ్‌ బోర్డును పెట్టుకోవచ్చు. గర్భిణి స్ర్తీలు కూడా ఇలా పైన చెప్పిన తీరుల్లో పడుకోవచ్చు. ‘ఫీటల్‌ ఫొజీషన్‌’ అనే పద్ధతి లోనూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఒక పక్కకు తిరిగి పడుకుని మోకాళ్లను గుండెల దగ్గరగా ముడిచి పెట్టుకొని తలను ఒక తలగడ మీద పెట్టుకొని పడుకునే భంగిమ ఇది. అయితే ఇలా పడుకొనేప్పుడు రెండు మోకాళ్ల నడుమా మరో తలగడపెట్టుకోవాలి. దీని వల్ల పై మోకాలి ఒత్తిడి వల్ల దిగువ మోకాలిలో రక్తప్రసరణ అంతరాయం ఉండదు.
మర్ధనా మంచిదే !


నడుం నొప్పి  మర్ధనా మంచిదే నంటారు ‘గుడ్‌ బై బాక్‌ ఏక్‌’ అనే పుస్తకాన్ని రాసిన డాక్టర్‌ డేవిడ్‌ ఇమ్రీ. మర్ధనా వల్ల కం డరాలకు హాయిగా ఉంటుంది. వాటిలో రక్తప్రసరణ అధికమ వుతుంది. మర్ధనా వల్ల శారీరకమైన లాభంతో పాటు మానసికం గా కూడా ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్తారు. నడుం నొప్పి తగ్గించుకోవడానికి తేలికైన చిట్కాలను కొన్నింటిని ఆయన తన పుస్తకంలో విడమర్చారు. హాట్‌ వాటర్‌ బాటిల్‌ను నడుం మీద పెట్టుకోవడం, వేడినీళ్ళ కాపడం లేదా ఆఖరికి వేడినీళ్ల స్నానమైనా మేలేనంటారు ఆయన. ఈ వేడినీటి చిట్కాలు తమ ప్రభావం కోసం15 నుంచి 20 నిముషాల సమయం పడుతుంది. అయితే నడుం నొప్పితో పాటు లోపల నరాలు దెబ్బతి న్నట్లుంటే కోల్డ్‌ ప్యాక్‌ పద్ధతి మంచిది. ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఐస్‌ ముక్కల్ని వేసి సీలు చేసి దానిని ఒక తడి టవల్‌లో పెట్టి వున్న చోట పెడితే ఆ ప్రాంతం అంతా అనస్టీషియా తీసుకున్నట్టుగా నొప్పి తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top