గుడ్డు తెల్ల సొనలో తురిమిన పుదీనా ఆకులు కలిపి ముఖమంతా సమంగా పూసుకుని అరగంట తరువాత కడుక్కోవాలి. ముఖం తుడుచుకుని తడి ఆరిన తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే ఫేషియల్ చేయించుకున్న లుక్ వస్తుంది. అయితే సాధారణ చర్మం గల వాళ్లకి మాత్రమే ఈ పద్ధతి. జిడ్డు లేదా పొడి చర్మం కలవాళ్లు పైన చెప్పిన మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కూడా కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది.