యాంటిక్ ఆభరణాలంటే పురాతనకాలంలో తయారైనవి లేదా ఆ డిజైన్లలో ఇప్పుడు తయారవుతున్నవి. ఇప్పుడు ఆభరణాల ఫ్యాషన్‌లో ట్రెండ్ వీటిదే. ఈ ఆభరణాలను పూర్వం బర్మా రూబీలు పొదిగి 18 లేదా 20 క్యారట్‌ల స్వచ్ఛతతో చేసేవారు. ఇప్పుడు ఆ మేకింగ్ చాలా తక్కువగా జరుగుతోంది. కొత్తగా తయారుచేసే యాంటిక్ పీస్‌లను 22 క్యారట్ల స్వచ్ఛతతో తయారుచేసి బర్మా రూబీలతో ఆఫ్రికన్ రూబీలు కూడా వాడుతున్నారు. ఆభరణానికి యాంటిక్ లుక్ వచ్చేటట్లు పాలిష్ చేస్తున్నారు. ఈ పనితనానికి మంచి గుర్తింపు వచ్చింది. పాత మోడల్స్ ఉన్నవారు వాటిని బయటకు తీస్తున్నారు. అవి లేనప్పుడు తమ వద్ద మామూలు బంగారు ఆభరణాలకే యాంటిక్ ఫినిషింగ్ చేయించుకుంటున్నారు. యాంటిక్ ఆభరణాలను స్టోన్స్ కలిపి లేదా స్టోన్స్ లేకుండా బంగారంతోనే చేయించుకోవచ్చు. ఇవి సాధారణంగా హెవీ వెయిట్ ఉంటాయి. తక్కువ వెయిట్‌లో కావాలన్నా చేయవచ్చు.
యాంటిక్ ఆభరణాలు అంటే..?
teluguLifestyle Editor
11:19:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.