ఇక మీదట 'అయ్యో... టైంకి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయానే' అని నాలుక కరుచుకోవాల్సిన అవసరం లేదు.

  ఇక మీదట 'అయ్యో... టైంకి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయానే' అని నాలుక కరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాత్ర వేసుకోవాల్సిన సమయాన్ని గుర్తు చేసే డిజిటల్ సెన్సర్ మార్కెట్‌లోకి త్వరలో రానుంది. ఈ సెన్సర్‌ను కాలిఫోర్నియాకు చెందిన 'ప్రోటస్ డిజిటల్ హెల్త్ ఇంక్' అనే సంస్థ కనుగొంది. కేవలం మందులు వేసుకోమని గుర్తు చేయడమే కాకుండా మనం శరీరాన్ని బద్ధకంగా ఉంచితే కూడా అది ఊరుకోదు. కాసేపు నడవాలని కూడా హెచ్చరిస్తుంది.

డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవాళ్లకి ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది అంటున్నారు వాళ్లు. దీనికి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోద ముద్ర కూడా వేసింది. "ఈ సాంకేతిక పరిజ్ఞానం మందులు మర్చిపోకుండా వేసుకునేలా చేసేందుకే కాని మీరు మతిమరుపు మనుషులని చెప్పేందుకు కాదు'' అంటారు ప్రోటస్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ అధికారి జార్జ్ సావేజ్. డిజిటల్ సెన్సర్ ఎలా పనిచేస్తుందంటే...

సెన్సర్‌ను మాత్రలాగానే లోపలికి మింగేయాలి. చర్మం పైన ఉండే ప్యాచ్‌తో సెన్సర్ అనుసంధానమై ఉంటుంది. ప్యాచ్‌ను వీపు లేదా ఉదర భాగాల్లో అతికించుకోవాలి. సెన్సర్ పంపించిన రిపోర్టు ఆధారంగా హెచ్చరికలు జారీ అవుతుంటాయి. ఉప్పు కణిక సైజులో ఉండే ఈ సెన్సర్‌కి బ్యాటరీ, యాంటెన్నాల వంటి వాటితో పనిలేదు. కడుపులో విడుదలయ్యే వివిధ రకాల రసాలతో తడిసి పనిచేయడం మొదలుపెడుతుంది.

చర్మంపై ఉండే ప్యాచ్ డిజిటల్ సందేశాన్ని రికార్డు చేయడమే కాకుండా పేషెంటు గుండె వేగాన్ని, శరీరం ఏ కోణంలో ఉంది, ఎంత చురుకుగా ఉందనే విషయాలను కూడా రికార్డు చేస్తుంది. అలా రికార్డు చేసిన డేటాను బ్లూటూత్ సౌకర్యం ఉన్న ఫోన్ లేదా కంప్యూటర్లకు పంపిస్తుంది. అది మాత్రలు వేసుకునే సమయాన్ని గుర్తుచేస్తుంది. "ఇది ఎంతో ప్రాచీనమైన మోర్స్ కోడ్ టెలిగ్రాఫ్ కీ పద్ధతిలాగానే పనిచేస్తుంది. కాకపోతే దాన్నే కాస్త ఆధునీకరించి డిజిటల్ సెన్సర్‌గా తయారుచేశాం'' 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top