బేకరీ ఐటమ్స్, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ అన్నీ మంచివి కావంటారు. ఒకవేళ అవి తప్ప వేరే అవకాశం లేనప్పుడు... కేవలం బర్గర్, పిజ్జా... ఈ రెండు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఏది మంచిది?

ఆ రెండింటిలో దేనిలో కూరగాయలు, ఆకుకూరల పాళ్లు ఎక్కువగా ఉంటే అది తినడం మంచిది. ఇలాంటివి తినాల్సి వచ్చినప్పుడు వాటిలో పొట్టు తీయని ధాన్యంతో పిండి పట్టి తయారు చేసినవి ఏమిటో కూడా తెలుసుకోండి. ఎందుకంటే పొట్టుతియ్యని ధాన్యంతో చేసిన బ్రెడ్‌తో రూపొందించిన ఆహారం... మామూలు పిండితో చేసిన దాని కంటే మంచిదని గ్రహించండి. అదే తినండి.

కొన్ని ఆహారాలను అంత ఆరోగ్యకరం కాదని మనం పరిగణిస్తుంటాం. ఉదాహరణకు కాఫీ, పిజ్జా, బర్గర్. మరి అచ్చంగా అవే తినాల్సి వస్తే వాటిలో ఏది ఆరోగ్యకరం, ఏది కాస్తంత బెటర్ అన్నది ఇది చదివాక మీకు తెలిసి పోయింది కదా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top