రాళ్లు కదలటం ఎక్కడైనా ఉందా?

రాళ్లు కదలటం ఎక్కడైనా ఉందా? అదే మిస్టరీ. వీటిని సైలింగ్‌ స్టోన్స్‌ అనీ... స్లైడింగ్‌ రాక్స్‌ అనీ... మూవింగ్‌ రాక్స్‌ అనీ - ఇలా ఎవరికి తోచిన అర్థాన్ని వారూ ఇస్తూ వచ్చారు. కాలిఫోర్ని యాలోని మృత్యు లోయ... అంటే డెత్‌ వ్యాలీలో సుమారు 700 పౌండ్ల బరువున్న రాతి శిలలు ఒకచోటి నుంచి మరో చోటికి కదులుతూ భూగర్భ శాస్తవ్రేత్తలకు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. డెత్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్‌లోని ఎండిన ఒక సరస్సు ఉంది. ఈ సరస్సులోనే ఆయా రాళ్లు దొర్లటం కాదు.. ఏకంగా జర్రున జారిపోతూంటాయి. ఈ సరస్సుని పర్యాటక అభిమానులు రేస్‌ట్రాక్‌ ప్లే అంటూ వ్యవహరిస్తారు. త్రేతాయుగంలో శ్రీరామ చంద్రుడు సముద్రంపై వారధి నిర్మించటానికి నీటిలో మునగని రాళ్లను వేయించాడట. 

బహుశా అటువంటి లక్షణాలు ఈ రాళ్లలోనూ ఉన్నాయా? లేక ఇక్కడి స్థానికులు వీటిని దొర్లిస్తూ కథలు సృష్టిస్తున్నారా? జంతువులు పనిగట్టుకుని నెడుతున్నాయా? ఐతే - ఈ కథనాలకు సరైన ఆధారాలు లేవు. ప్రతి రెండు మూడేళ్ల కొకసారి మాత్రమే ఈ రాళ్లు కదులుతాయి. అదీ సమాంత రంగా... ఒక రాయి కదలటం మొదలెడితే - ఆ రాతితోపాటే మరో రాయి తన దిశని మార్చు కుంటుంది. అదీ ఒకే బరువున్న రాళ్లు కావటం విశేషం. జియాలజిస్టులు జిమ్‌ మెక్‌ అలిస్టర్‌, అల్లెన్‌ ఆగ్నే 1948లో పరిశోధనల నిమిత్తం ఈ నేషనల్‌ పార్క్‌ని సందర్శించారు. మంచు పర్వత శ్రేణులైతే రాతి శిలలు వేగంగా కదులుతాయనటానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఆ దాఖలాలు లేవు. 

కొన్నాళ్ల పరిశోధనల అనంతరం కూడా వీటి కదలికల ఆచూకీ కనిపెట్టలేక పోయారు. పరిశోధనలు జరుగుతున్నంతసేపూ ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు ఆ పరిశోధనలు ముగిసి మూటా ముల్లె సర్దుకుని చక్కా వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ - వాటిని వీడియోలో బంధించలేక పోయారు. ఫొటోలు మాత్రం తీయగలిగారు. ఆ తర్వాత 1955లో. 1972లో బాంబ్‌ షార్ప్‌, డ్విట్‌ కేరే అనే శాస్తవ్రేత్తలు మళ్లీ పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో పరిశోధనల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ సంగతులేవీ ఇతమిత్థంగా తెలీలేదు. 

రాళ్ల కదలికకు మంచు కారణమనీ, వేసవి కాలంలో వీటిలో కదలికలు అస్సలు లేవనీ, శీతాకాలం లో మాత్రమే ఇవి కదులుతున్నాయని తేల్చారు. ఆయా కాలాల్లో వీచే గాలులు... శీతోష్ణ స్థితిగతులు... ఇవన్నీ రాతి కదలికలపై ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు. మరో విశేషం ఏమిటంటే - పరిశోధనల్లో భాగంగా ఆయా రాతి శిలలపై మానవ బలాన్ని ప్రయోగించినప్పటికీ అవి కదలకపోవటం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top