జాగింగ్‌ మీకు సరిపడుతుందా?

చాలామంది మహిళలు శరీరాన్ని, మనసుని కంట్రోల్లో ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక వ్యాయామాలు చేస్తున్నారు. అందులో భాగమే జాగింగ్‌. తెల్లవారు జామునే దగ్గర్లో ఉన్న పార్క్‌ల్లోను, లేకపోతే ఆసమయంలో రోడ్లు ఖాళీగా ఉంటాయి కనుక రోడ్లమీద, వాకింగ్‌, జాగింగ్‌లు చేస్తూవుంటారు. రోడ్ల మీద కన్నా, చెట్లూ, పచ్చని లాన్‌లు ఉన్న పార్క్‌ల్లో చేస్తే మంచి ఫలితంత ఉంటుంది. కానీ, మన శరీరసౌష్టవాన్ని బట్టి ఎంత సేపు జాగింగ్‌ చేయాలి, ఎన్ని రౌండ్లు చేయాలి అనే విషయాలు ముందుగా తెలుసుకోవడం మంచిది. మన రక్తప్రసరణ, బరువు ఏస్థాయిలో ఉన్నాయో నిపుణులతో సంప్రదించి వారు చెప్పిన పద్దతిని పాటిస్తే ఆరోగ్యం మన చెప్పుచేతల్లో ఉంటుంది. 

ఎవరో చేస్తున్నారు కదాని మనం కూడా చేయాలనుకుంటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జాగింగ్‌కి వెళ్ళి గుండె సమస్యతో ఆసుపత్రి పాలైనవారు ఎందరో ఉన్నారు. ఎటువంటి వ్యాయామానికైనా ముందుగా వైద్య సలహా తీసుకుని, నిపుణుల సమక్షంలో కొంతకాలం శిక్షణ తీసుకుని దానిని అమలు చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. అన్నిటికన్నా మహిళలు ఇంటిపనిని ఇష్టంగా చేస్తూవుంటే ఏ సమస్యా ఉండదు. అదే పెద్ద ఎక్స్‌ర్‌సైజ్‌.....
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top