క్రెడిట్ కార్డు - కొన్ని ముఖ్య సూత్రాలు

ఆలస్యంగా బిల్లు చెల్లించకూడదు 
నష్టం : ఒక్కరోజు ఆలస్యానికి నెల రోజుల వడ్డీ కట్టాల్సిన ప్రమాదం. ఆ నెలలోని కొనుగోళ్లన్నిటికీ ట్యాక్సు పడే అవకాశం.

కార్డు పోతే ఫిర్యాదులో ఆలస్యం వద్దు
నష్టం: చాలా క్రెడిట్ కార్డులకు పిన్ నంబరుండదు. ఎవరైనా వాడుకోవచ్చు. అందుకే గంటలోపు బ్లాక్ చేయాలి.

వాడకం 40 శాతం మించొద్దు
నష్టం: సాధారణంగా క్రెడిట్ కార్డు లిమిట్ మన నెల జీతంతో సమానంగా గాని అంతకంటే ఎక్కువ గాని ఉంటుంది. బైకులో 140 స్పీడు పోయే అవకాశమున్నా 80కి మించి పోము కదా. అలాగే క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతున్నా 40 శాతం కంటే ఎక్కువ వాడితే ప్రమాదం.

మొత్తం సొమ్ము చెల్లించండి.

నష్టం : మొత్తం ఒకేసారి కట్టడం అలవరచుకోవాలి. ఎప్పుడూ మినిమమ్ అమౌంట్ కడుతూ అసలు ఆలస్యంగా చెల్లిస్తే క్రెడిట్ స్కోరు తగ్గి బ్యాంకు రుణాలు రావడం కష్టమయ్యే ప్రమాదముంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top