చర్మానికి మేలు చేయని ఆహారాలు...

ఇవి ఎక్కువగా తీసుకుంటే చర్మానికి అంతగా మేలు జరగదు. పైగా మితిమీరి తీసుకుంటే కీడు కూడా ఎక్కువే. అందుకే వీటి విషయంలో విచక్షణ అవసరం. ఈ ఆహారం వివరాలివి... 

ఆహారం: కాఫీ, టీ, శీతలపానీనియాలు, కెఫిన్ ఎక్కువగా ఉండే కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్. 
కీడు: వీటిల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. కెఫిన్ చర్మం నుంచి తేమను గ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తుంది. నీటిని తొలగిస్తుంది. కాబట్టి విషాలు పేరుకుపోయే అవకాశం ఎక్కువ. 


ఆహారం: చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, స్వీట్స్, ఎక్కువ తీపి ఉండే పానీయాలు. 
కీడు: తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ అవకాశాలను పెంచుతుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారంతో మొటిమలు వస్తాయి. 


ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్‌డ్ ఫుడ్. పిజ్జాలు, బాగా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు. 
కీడు: ఇందులో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడుతలు పడేందుకు దోహదం చేస్తాయి. 


ఆహారం: నూనె వస్తువులు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనె ఉపయోగించిన పదార్థాలు. 
కీడు: ఇందులో ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. నూనెల వల్ల ముఖంపైన ఉండే చర్మం జిడ్డుగా మారే అవకాశం కూడా ఎక్కువ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top