కోకో కోలా తాగటానికి కాకుండా మొండి మరకల్ని వదలగొట్టడంలో SUPER

 కూల్‌డ్రింక్ అనగానే కోలా సీసాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కోలా బాటిల్ దొరగ్గానే తాగేయడం కాకుండా దాంతో బోలెడు పనులు చేసుకోవచ్చు. మొండి మరకల్ని వదలగొట్టడంలో కోలా తనకు తానే సాటి అంటోంది.

వంటింట్లో మాడిన వంటసామాన్లు త్వరగా శుభ్రం కావు. అలాంటి పాత్రలో అర కప్పు కోలా వేసి ఓ పదినిమిషాల తర్వాత కడిగితే పాత్రకి పట్టుకున్న మాడు వెంటనే వదిలిపోతుంది. అలాగే స్టీలు సామాన్లపై పేరుకుపోయిన తుప్పు మరకల్ని కూడా కోలా ఇట్టే తొలగిస్తుంది. ఎక్కడైతే తుప్పు మరకలు ఉంటాయో...అక్కడ ఐదారు చుక్కల కోలా పోసి ఓ పావుగంట తర్వాత స్పాంజ్‌తో గట్టిగా తుడిస్తే వెంటనే తుప్పు మరకలు పోతాయి. అలాగే బాత్‌రూమ్‌లలో వాడే టబ్బులు సున్నం మరకలతో ఉంటాయి. 

అలాంటి మరకల్ని కూడా కోలా ఇట్టే పోగొడుతుంది. టబ్బులపై కోలా నీళ్లు చల్లి పదినిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే కొత్త టబ్బుల్లా తయారవుతాయి. సన్నటి దుమ్ము పట్టిన గాజు అద్దాలను కూడా కోలాతో శుభ్రం చేసుకోవచ్చు. ఒక మగ్గులో ఒక కప్పు కోలా, రెండు కప్పుల నీళ్లు పోసి అందులో బట్టని ముంచి గట్టిగా పిండి ఆ బట్టతో అద్దాలను తుడిస్తే తళతళలాడుతాయి. ఇవన్నీ ఒకెత్తయితే...బట్టలపై ఉండే మరకలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా నూనె మరకలు.

కొన్నిసార్లు రక్తపు మరకలు కూడా పోవు. ఈ రెంటికీ కోలా మంచి డిటర్జెంట్‌గా ఉపయోగపడుతుంది. బట్టల్ని నానబెట్టేముందు డిజర్జెంట్ నీళ్లలో రెండు కప్పుల కోలా కూడా పోయాలి. లేదంటే వాషింగ్ మిషన్‌లో వేసినా పరవాలేదు. నూనె, రక్తపు మరకలు త్వరగా వదిలిపోతాయి. కేవలం తాగడం కోసమే అనుకునే కోకో కోలా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలియక చాలామంది బాటిల్ దొరగ్గానే పూర్తిగా తాగేస్తారు. ఈసారి కొద్దిగా కోలాని మిగిల్చి క్లీనింగ్‌కి వాడి చూడండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top