ఒకరోజులో ఎనిమిది గంటలు డెంచర్స్ తీసి పెట్టాలి. (అత్యవసరమైతే తప్ప) రాత్రిపూట పడుకోబోయే ముందు వీటిని తీసేయడం మంచిది తీసిన డెంచర్స్ని, శుభ్రంగా కడిగిన గిన్నెలో నీళ్లుపోసి అందులో వేసి మూత పెట్టాలి ఉదయం నిద్రలేవగానే టూత్‌బ్రష్‌తో వాటిని శుభ్రంగా కడిగి, మన గమ్ప్యాడ్ను కూడా వేలితో శుభ్రం చేసుకుని ఆ తర్వాతే డెంచర్స్ ధరించాలి ఇప్పుడు మార్కెట్లో డెంచర్స్ కోసం రకరకాల బ్రష్‌లు, క్లీనింగ్ ఏజెంట్స్ దొరుకుతున్నాయి డెంచర్స్ వల్ల పడే ఒత్తిడి కారణంగా చిగుళ్లపై ఏవైనా గుర్తులు (ప్రెషర్ సైన్స్) పడినా లేదా చిగుళ్లు ఎర్రబారి కనిపించినా వెంటనే దంతవైద్యుడిని కలవాలి.