జ్ఞానదంతాలు వచ్చే సమయంలో...

జ్ఞానదంతం వచ్చే సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. సాధారణంగా ఇవి 18 నుంచి 24 ఏళ్ల వయసులో అంటే జ్ఞానం వచ్చాక వస్తాయి. అందుకే వీటిని జ్ఞానదంతాలు అంటారు. ఇలా ఇవి వచ్చే సమయంలో పన్ను అమరడానికి తగినంత చోటు లేక ఒక్కోసారి ఇది సగమే రావచ్చు. దాన్ని ఇంపాక్టెడ్ విజ్‌డమ్ టీత్ అంటారు. సగమే బయటకు వచ్చిన ఈ పంటి చుట్టూ ఆహార కణాలు చేరుతాయి. అంతేకాదు... అప్పుడప్పుడూ ఈ ప్రాంతంలో చీము పట్టి దవడ వాచిపోవచ్చు. దీన్నే పెరికరొనైటిస్ అంటారు. 

ఈ సమస్య ఉన్నప్పుడు జ్ఞానదంతం ప్రాంతంలో భరించరాని నొప్పి, వాపు రావడం, నోరు తెరవలేకపోవడం, నోటి నొప్పి చెవి, మెడకు వ్యాపించడం, తలనొప్పి, పక్కపళ్లకూ నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి సమయంలో విధిగా దంతవైద్యుడిని సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు వాడాల్సి ఉంటుంది. పంటి నొప్పి ఉన్నవైపు పడుకోకుండా మరోవైపునకు తిరిగి పడుకోవాలి. ఒకసారి పంటివాపు, నొప్పి తగ్గాక డాక్టర్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకుని, సగమే వచ్చిన జ్ఞానదంతాన్ని తొలగింపజేసుకోవలసి ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top