వయసు పైబడినా వృద్ధాప్యం రాకూడదంటే?

వృద్ధులు - వ్యాయామాలు - సూచనలు


  • గుండెపై అధిక ఒత్తిడి కలిగించే వ్యాయామాలు చేయకూడదు.
  • ఊపిరితిత్తులపై భారం పడకూడదు. అధిక ఆయాసం కలిగించే వ్యాయామాలు చేయకూడదు.
  • ఆకలిని పెంచి, కొద్దిపాటి చమటలు వచ్చే తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
  • వ్యాయామానికి ముందు కొద్దిగా వామ్‌ ఆప్‌ కావడానికి 5 ని కేటాయించండి.
  • వ్యాయామాన్ని నెమ్మదిగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి వేగంగా చేయకండి. నెమ్మదిగా ప్రారంభించి తరువాత దశల్లో వేగాన్ని పెంచండి.
  • శరీరంలో అవయవాలన్నింటికీ ప్రభావం చూపే వ్యాయామాలు చేయాలి. వ్యాయామం తర్వాత ఎక్కువ నీళ్ళు గటగటా తాగకూడదు. అధికదాహం కలిగించే వ్యాయామాలు చేయకూడదు.
  • వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి.

    ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
  • కుర్చీలో కూర్చుని లేవడం.
  • గోడకు చేతులు ఆనించి, శరీరాన్ని కదిలించే పుషప్స్‌ చేయడం.
  • శరీరాన్ని సాగదీసే స్ట్రెచింగ్‌ వ్యాయామాలు.
  • కుర్చీలో కూర్చొని కాళ్ళు ఆడించడం.
    వ్యాయామాలతో పాటు నడక అన్ని విధాలా శ్రేష్టమైన వ్యాయామం. వ్యాయామం చేసినా చేయకపోయినా ప్రతిరోజు కనీసం 30 నిల పాటు నడిస్తే వృద్ధాప్యంలో కూడా ఎంతో చలాకీగా ఆరోగ్యంగా జీవించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top