జిమ్‌లో ఉండే అన్ని రకాల వ్యాయామాలు చేయడానికి సిద్ద పడకూడదు. ముందుగా మీరు ఏ సమస్య నుంచి బయటపడడానికి జిమ్‌కి వెళ్ళాలనుకున్నారో అందుకు తగిన వ్యాయామం ఏమిటో కచ్ఛితంగా నిపుణుల్ని అడిగి తెలుసుకోవాలి. ఒక్కో సమస్యకి ఒక్కొ విధమైన వ్యాయామ పరికరాన్ని వినియోగించ వలసి వస్తుంది. ఒక వేళ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికైతే ముందుగా ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం చేయడానికి మన శరీరం అనుకూలంగా ఉందో లేదో వైద్యుల్ని సంప్రదించి తెలుసుకోవాలి. అలాగే నడుము సన్నగా ఉండటం కోసం చేసేవ్యాయామం, ఛాతీ పెంచుకోవడానికి చేసే వ్యాయామం, శరీర సౌష్టవాన్ని పెంచుకుందుకు చేసే వ్యాయామం ఇలా అనేక రకాలు ఉంటాయి. మన సొంత ఆలోచనలతో జిమ్‌లో చేరిపోయి, పక్కవాళ్ళని చూసి అన్నీ చేసేద్దాం అనుకుంటే ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవాళ్ళమే అవుతాం.
జిమ్‌కి వెడుతున్నారా..!
teluguLifestyle Editor
10:29:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.