గొంతు వాపు, మంట తగ్గాలంటే...

ఒక్కోసారి మనం కాఫీ వంటి పానీయాలను వేడి చూసుకోకుండా గబుక్కున తాగేస్తుంటాం. అలాంటప్పుడు గొంతు కాలిపోయే ప్రమాదం ఉంది. అలాగే కొందరిలో ఇన్‌ఫ్లమేషన్ వల్ల కూడా గొంతు వాచే అవకాశం ఉంటుంది. అలాంటి గొంతువాపును, మంటను తగ్గించడానికి చేయాల్సిన ప్రథమచికిత్స...


గొంతు కాలినవారు నిటారుగా కూర్చోవాలి. పడుకోవడం సరికాదు. పడుకుని ఉన్నప్పటి కంటే కూర్చున్నప్పుడు ఊపిరి బాగా ఆడుతుంది. అందుకే ఈ జాగ్రత్త. 

ఇలాంటి సందర్భాల్లో ఒక ఐస్ గడ్డను చప్పరించాలి. 
వెన్న, ఆలివ్ ఆయిల్‌ను స్వల్పంగా గొంతులోకి దిగేలా తీసుకోవచ్చు. 
వేడినీటిలో ముంచి మెలిపెట్టిన టవల్‌ను కాసేపు మెడకు చుట్టి ఉంచాలి. 

ఒకవేళ శ్వాస అందకపోతే, నోటిద్వారా కృత్రిమ శ్వాస ఇచ్చి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top