ఇందులో ఆరోగ్యసూత్రం దాగి ఉంది. ఇంటి ముందు పడిన దుమ్ము, ధూళిని ఉదయాన్నే చీపురుతో చిమ్మి శుభ్రం చేసుకుంటాం. ఆ తర్వాత నేల మీద నీటిని చల్లితే నేల చల్లబడడంతోపాటు తేమ ఉన్నంత వరకు దుమ్ము పైకి లేవదు. ఈ ప్రక్రియ మనకు క్రీ.పూ నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఇలా చల్లేది మామూలు నీరు కాకుండా ఔషధపూరితమైనదైతే మరింత ప్రయోజనం కదా! అలా అలవాటైనదే కళ్లాపి చల్లడం. కళ్లాపి అంటే గోమయం (ఆవు పేడ) కలిపిన నీరు. గోమయం సహజమైన క్రిమిసంహారిణి. దీనిని నీటిలో కలిపి ఇంటి ముందు చల్లడం వల్ల అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఆవులు తగ్గిపోవడంతో ఇప్పుడు గ్రామాల్లో కూడా గోమయం దొరకడం కష్టమవుతోంది. దాంతో కళ్లాపికి గేదె పేడ వాడుతున్నారు. కానీ గోమయం వాడకం ఆరోగ్యదాయకం.
కళ్లాపి ఎందుకు చల్లుతారు?
teluguLifestyle Editor
1:14:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.