మంచం కోళ్లను సాదాగా తయారు చేయరు. తరిణ బట్టి నొక్కులుగా, ఒంపులుగా డిజైన్ చెక్కుతారు. పైగా సాదాగా చెక్కిన కొయ్యను మంచం కోడుగా వాడకూడదనీ చెబుతారు. ఎందుకంటే... పూర్వం అందరూ గ్రామాల్లో, పంట పొలాలకు దగ్గరగా జీవించేవారు. సాయంత్రం చీకటి పడినప్పట్నుంచీ తెల్లవారే వరకు దీపపు వెలుతురుతో గడపాలి. రాత్రయితే పాములు, తేళ్లు వంటి విషకీటకాల సంచారం ఎక్కువవుతుంది. మంచం కోడు సాదాగా ఉంటే ఈ విషపురుగులు మంచం మీదకు పాకే ప్రమాదం ఉంది. కోడుకు నొక్కులు ఉంటే ఎక్కలేవు. అందుకే కోళ్లకు కచ్చితంగా నొక్కులు పెట్టి తయారుచేసేవారు. తర్వాత్తర్వాత ఇదే అలవాటైపోయింది.