ఉప్పు ఎక్కువగా తింటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందన్న సూకా్ష్మన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన నియమం ఇది. సాధారణంగా మనం తినే ఆహారంలోనే సోడియం ఉంటుంది. పైగా రుచి కోసం అన్ని కూరల్లోనూ ఉప్పు వేస్తాం. పగలు శారీరకంగా శ్రమించేటప్పుడు దేహం నుంచి చెమట రూపంలో సోడియం బయటకు పోతుంది. నీరసం ఆవహిస్తుంది. అలాంటప్పుడు ఆహారంలో ఉప్పు వేసుకుంటే శరీరం... కోల్పోయిన లవణాలను తిరిగి వెంటనే భర్తీ చేసుకుంటుంది. మజ్జిగలో ఉప్పు వేసుకోవడం, పాడి లేని వాళ్లు అన్నంలో నీళ్లుపోసుకుని ఉప్పు కలుపుకుని తినడం వంటి అలవాట్లన్నీ ఇలా వచ్చినవే. అయితే రాత్రి శారీరక శ్రమ ఉండదు కాబట్టి శరీరానికి తక్షణం లవణాలు అందించాల్సిన అవసరం ఉండదు. అందుకే రాత్రి ఉప్పు వాడకూడదనే నియమం పెట్టారు. దీనిని ఎంత కచ్చితంగా చెప్పారంటే రాత్రి పూట ఉప్పును తలవడం కూడా పాపం అనేటంతగా విశ్వాసాన్ని పెంపొందించారు.
రాత్రి ఉప్పును ఎందుకు తలవకూడదు?
teluguLifestyle Editor
12:09:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.