అగ్నిలింగంగా పేరుగాంచిన మహదేవలింగం ఎక్కడ ఉంది?

అగ్నిలింగంగా పిలిచే మహదేవ లింగం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయం తిరుమన్నామలై క్షేత్రంలో ఉంది. ఈ లింగాన్ని తేజోలింగం అని కూడా అంటారు. తమిళనాడులోని అరుణాచలం పట్టణంలో ఉంది. విల్లుపురం- కాట్పాడి రైల్వేలైన్‌లో ఉన్న ఈ దివ్యక్షేత్రం చెన్నై నుంచి 68కి.మీ.ల దూరంలో ఉంది. అరుణాచలంలో ఉన్న స్వామి అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అరుణాచలేశ్వరి. ఈ అమ్మవారిని అభిదకుజాంబాళ లేదా ‘ఉన్నామలై అమ్మె’ అని కూడా పిలుస్తారు. అరుణాచలేశ్వర స్వామి ఆలయం చాలా పెద్దది. అరుణాచల శిఖరాగ్రం నుంచి అగ్నిశిఖ ఒకటి ప్రాదుర్భవించి తేజోలింగరూపంలో వెలసిందని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఐదుప్రాకారాలతో, తొమ్మిది గోపురాలతో అలరారుతోంది. తూర్పున ఉన్న గోపురం 217 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో కార్తీకపౌర్ణమినాడు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. 

ఈ క్షేత్రాన్ని పృథ్వికి హృదయక్షేత్రంగా భావిస్తారు. కొండచుట్టూ పన్నెండు కిలోమీటర్లు ప్రదక్షిణం చేసి స్వామిని దర్శించుకోవాలి. ఈ వేడుకను గిరి ప్రదక్షిణ ఉత్సవంగా జరుపుకుంటారు. దేశంలో ప్రసిద్ధ శైవధామాలలో ఇదొకటి. ఇక్కడే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రానికి చేరడానికి రాయవెల్లూరు నుంచి బస్సు సౌకర్యం ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top