కంట్లో నలక పడినప్పుడు...

- మనం వాహనం మీద పోతున్నప్పుడో, గట్టిగా గాలి పీల్చినప్పుడో కంట్లో నలకపడటం చాలా సాధారణం. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే...
- కంటి మీద ఒత్తిడి పెట్టకూడదు. నలపకూడదు. దీనివల్ల నలక మరింత లోపలి పొరల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. 
- యాంటీబయోటిక్ చుక్కల మందు వాడవచ్చు. పాలు, పసరు, స్టెరాయిడ్ డ్రాప్స్ వంటివే కంట్లో వేయకూడదు. 
- కంటిని శుభ్రమైన నీటితో ఎక్కువసేపు కడగాలి. నల్లా నీటిలో క్లోరిన్ ఉంటే మంట ఎక్కువ అవుతుంది కాబట్టి సాధారణ తాగేనీరు లేదా మినరల్ వాటర్ వాడటమే మంచిది. 
- కన్ను ఎర్రబారినా, నీళ్లు కారినా, నొప్పి వచ్చినా, రక్తస్రావం అయినా వెంటనే కంటివైద్యుడిని సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కంటికి కట్టు కట్టకూడదు. 
- పై ప్రథమ చికిత్స తర్వాత చూపు కనుక తగ్గినట్లనిపిస్తే, వెంటనే నేత్రవైద్యుడిని సంప్రదించాలి. 
- ఒకవేళ మీరు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నట్లయితే మీ కంట్లో ఏదైనా నలకపడిన తర్వాత అప్పటివరకూ వాడిన కాంటాక్ట్ లెన్స్‌ను ఇక ఉపయోగించకూడదు. 
- చిన్నపిల్లల కంట్లో ఏదైనా పడినప్పుడు ఏ మేరకు ప్రమాదం జరిగిందో నిర్ధారణ చేయడానికి తక్షణం కంటివైద్యుడిని సంప్రదించాలి. ఒకవేళ మీరే నలక తీసినా కూడా వైద్యుడిని కలవడం మంచిది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top