ఆకలి రుచెరుగదు నిద్ర సుఖమెరుగదు.....ఎలా వచ్చిందో తెలుసా ?

అవసరం, సౌకర్యం రెండూ పరస్పర భిన్నమైనవి అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. సాధారణంగా మనం రుచిగా ఉన్న పదార్థాలను తినాలని కోరుకుంటాం. అలాగే సౌఖ్యంగా పరుపుల మీద నిద్రపోవాలనీ కోరుకుంటాం. అంటే దేహం క్రమంగా ఈ సౌఖ్యాలకు అలవాటు పడిపోతుంది. కానీ అత్యవసరంలో దేహం వీటిలో దేనినీ కోరుకోదు. ఉదాహరణకు చాలామంది తినే పదార్థం రుచిలో ఏ మాత్రం తేడా వచ్చినా వంకలు పెడుతుంటారు, రుచిగా లేదని వదిలేస్తుంటారు కూడ. 

అయితే అదే మనిషికి బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెడితే ఈ పదార్థాలనే ఏ వంకలూ పెట్టకుండా చక్కగా తింటారు. అలాగే మెత్తటి పరుపులు, ఫ్యాన్లు, ఏసీ వంటివి లేకపోతే నిద్ర పట్టనివాళ్లు కూడా బాగా అలసిపోయినప్పుడు ఇవేవీ లేకపోయినా హాయిగా నిద్రపోగలుగుతారు. అన్నం, నిద్ర నిజంగా అవసరమైనప్పుడు రుచులు, సౌఖ్యాలు లేకపోయినా కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోతారు అని చెప్పడం ఇందులోని ఉద్దేశం. 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top