అందం కోసం ప్రకృతి ప్రసాదాలు

పసుపు కొమ్ములుగా పేర్కొనే మొక్క వేళ్లను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా వాడతారు. పసుపు కీటక నాశినిగా పనిచేస్తుంది. ముఖానికి కూడా సౌందర్య సాధనంగా పసుపు రాసుకుంటారు. ముఖానికి మెరుగైన ఛాయతో పాటు కాంతివంతం అవుతుంది. మన సంస్కృతిలోని ఉత్సవాల్లో కాళ్లకు పసుపుతో పాటు మెడపై గంధం రాస్తుంటారు. సౌందర్య సాధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకల్లో వినియోగిస్తుంటారు. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యంగా వాడడంతో పాటు చలువచేసే సాధనంగానూ ఉపయోగిస్తారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గందాన్ని తయారు చేసి వాడతారు. దీన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో పెఫ్యూమ్స్‌లో, సబ్బుల్లో , ఫేస్‌ ప్యాకులుగానూ ఉపయోగిస్తున్నారు. చందనంతో ముఖానికి ప్యాక్‌ వేయడంతో నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే.

ముఖానికి ఉన్న జిడ్డు తొలగించడానికి దీన్ని ఒక ప్యాక్‌ లా వేసుకోవడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతి, దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో మేని ఛాయ మెరుగవుతుందన్నది విశ్వాసం. ఇది ముదిరిన కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంస్కృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే ఇది శ్రేష్టమైనది. దీనితో పాటు ఆరోగ్యకరమైన, కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా మామూలే. కొబ్బరి నూనెను శరీరానికి బాగా పట్టించి మర్ధన చేయడం వల్ల శరీరానకి కావలసిన తేమ అంది, చర్మం చూడటానికి సున్నితంగా, మెరుస్తూ కనిపిస్తుంది. ఇటీవల మెహందీ పేరిట ప్రాచుర్యం పొందిన ఆకు నుంచి తీసే ఈ ఉత్పాదనను సౌందర్య సాధనంగా ఎప్పటినుంచో మన సంసౄఎతిలో ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్‌ ఏజెంట్‌ గా మాత్రమేకాక చల్లదనాన్ని ఇచ్చే సౌందర్య సాధనంగా పేరుపొందింది.

ఇటీవల దీన్నీ తలకు వేసే రంగుల్లో ఉపయోగిస్తున్నారు. నిజానికి పెళి ్లసంబరాల్లో ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది ఒక సంస్కృతి. ఇది కొన్ని రసాయనాలతో పాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి రోజూ చంటిపిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందు లోనుంచి వచ్చే పొగ క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలున్న గదిలో దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకొని హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేస్తుందన్నామాట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top