కొంచెం పాలు తీసుకుని అందులో చిటికెడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది. పావు చెంచా పాల పొడిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. పది నిమిషాలు ఆగిన తరువాత చల్లటి నీళ్లతో కడిగి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కమలాఫలం తొక్కను ఎండబెట్టి పొడి చేసి అందులో తగినంత పెరుగు కలిపి మిశ్రమంలా తయారు చేసి ముఖం, మెడకు రాసుకుని పావు గంట అయ్యక కడిగేస్తే మేను నిగారింపు సొంతం చేసుకుంటుంది. రెండు చెంచాల నిమ్మరసంలో అరచెంచా తేనె కలిపి ఒంటికి రాసుకొని అరగంతయ్యాక స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది.
మీ ముఖం మెరుస్తూ ఉండాలంటే.....
teluguLifestyle Editor
3:19:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.