పిల్లల్లో ఏడుపు మాన్పించండిలా..

చిన్నారులు తొలి రోజుల్లో తమ అనుభవాలను మాటలతో చెప్పలేరు. వారికి బాధ కలిగితే, కోపమొస్తే ఏడుస్తూ తెలుపుతారు. బాగా మాటలు వచ్చేవరకు ఏడుపే వారి భాష. మనలో చాలా మంది పిల్లలు ఏడిస్తే చాలు వారికి కడుపు నొప్పి వచ్చిందని అనుకుంటాం. ఎడాపెడ ఏదో ఒక మందు పోస్తాం. ఇది చాలా ప్రమాదకరమైన పని. చాలా సందర్భాల్లో ఏడుపునకు కడుపునొప్పి కారణం కాదు. ఏడుపు అలా ఉంచితే, మందులతో ఎన్నో ప్రమాదాలు జరగొచ్చు.మరో ముఖ్యమైన విషయం 90 శాతం సందర్భాల్లో పిల్లలు ఏడుపునకు కారణం రోగాలు కాదు. కాబట్టి మందులు వాడనవసరం లేదు. ఏడుపే వారి భాష కాబట్టి ఏడుపుతో వాళ్ల అవసరాలు తెలుపుతారు. మనం జాగ్రత్తగా గమనిస్తే, ఏడుపునకు కారణం ఇట్టే కనిపెట్టవచ్చు. సాధారణంగా చాలా మంది పిల్లలు ఆకలయితే ఏడుస్తారు తల్లిపాలు తాగే పిల్లలకు తల్లిపాలు పట్టాలి. పాలు చాలక ఏడుస్తున్నాడని తొందరపడి పోతపాలకు పోకండి. చిన్నారి రోజుకు ఆరుసార్లుపైన మూత్ర విసర్జన చేస్తుంటే తల్లిపాలు సరిపోయినట్లే !

అదనపు ఆహారం ఇచ్చే పిల్లలకు, ఆహారం పెట్టి చూడండి. ఆకలి తీరితే ఏడుపు మానతారు. కొందరు లావుగా ఉండే పిల్లలు దప్పికతో ఏడుస్తారు. వారికి నీరు తాపించి చూడండి. దప్పికి తీరితే ఏడుపు మానేస్తారు. పక్క తడిపితే పిల్లలు ఏడుస్తారు. వెంటనే ఒళ్తు తుడిచి, పొడి బట్టలు వేయాలి. వేసవిలో బిగుతుగా బట్టలు వేసినా, చలి కాలంలో బట్టలు వదులుగా వేసినా, అసలే వేయకున్నా చిన్నారులు ఏడుస్తారు. కొందరు చిన్నారులు ఎక్కువ వెలుగును భరించలేక ఏడుస్తారు. మరి కొందరు ఎక్కువ చీకటిని భరించలేక ఏడుస్తారు.కొందరు చిన్నారులకు ఎక్కువ శబ్దాలు అంటే సరిపోదు. ఇంటి పరిసరాలలో, ఇంట్లో శబ్దాన్ని బాగా తగ్గించండి. వీరికి ఎక్కువగా కొత్తవారు ఇంటిలో తిరిగితే చికాకు. చెప్పలేరు కాబట్టి ఏడుస్తారు. సున్నితమైన సంగీతంతో వీరు ఏడుపు మానవచ్చు. కొందరు పిల్లలు అలసిపోతే ఏడుస్తారు. కొందరు పిల్లలు కొంచెం సేపు ఏడ్చి కాని నిద్రపోరు. ఒంటరిగా వదిలేస్తే తోడుకోసం చిన్నారులు ఏడుస్తారు. తల్లిదండ్రులలో మానసిక ఒత్తిడి ఉంటే కూడ పిల్లలు ఏడుస్తారు. 


కొందరు సంపన్నుల కుటుంబాలలో పిల్లలు - త్వరగా ‘లావు’ కావాలని అనవసరంగా ఎక్కువగా డబ్బాపాలు, అదనపు ఆహారం పెడతారు. ఆ పిల్లలు అదనపు ఆహారం తినే శక్తిలేక ఏడుస్తారు.
గారాబం కూడా చిన్నారులలో ఏడుపునకు కారణమే ! ఎప్పుడూ ఎవరో ఒకరు ఎత్తుకోవడం, హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తుంటే ఏడుస్తారు.ఈ మధ్యకాలంలో పిల్లలపై జరిగే హింస కూడా వారి ఏడుపునకు కారణం. జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తారు. పలుచని గుడ్డ ఒత్తిలాగ చేసి ముక్కు రంధ్రాలు శుభ్రం చేయాలి. ముఖానికి కాస్త ఆవిరిని జాత్త్రగా పట్టాలి. ఛాతిపై తరచుగా తట్టండి. ఆట్టే ఏడుపు మానతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top