రాత్రి సూది ముట్టరాదు, బట్టలు కుట్టరాదు... అనేది పూర్వపు రోజుల్లో అప్పటి కాలమాన పరిస్థితులకు అను గుణంగా వాడుకలోకి వచ్చిన నిబంధన. విద్యుత్ దీపాలు లేని రోజుల్లో చీకటిని పార దోలడానికి చమురు దీపాలు వాడేవారు. ఆ కొద్దిపాటి వెలుతురులోనే అప్పటికి అవసరమైన పనులు చేసుకునేవాళ్లు. సూదిలో దారం ఎక్కించి వస్త్రాన్ని కుట్టడం వంటి పనులకు మంచి వెలుతురు ఉండాలి. ఈ పనులను గుడ్డి వెలుతురులో చేస్తే చూపు మందగిస్తుంది. పొరపాటున సూది చేతి నుంచి జారి పడిపోతే వెతకడం కష్టం. దానిని అలా వదిలేస్తే పాదాల్లో దిగబడే ప్రమాదమూ ఉంటుంది. ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాత్రి కుట్టకూడదనే నియమం పెట్టారు. దానినే మరింత గట్టిగా చెప్పడానికి సూదిని ముట్టరాదనే వారు. ఇప్పుడు పట్టపగలును తలపించే లైట్ల కాంతి అందుబాటులో ఉంది. దాదాపుగా దర్జీలందరూ రాత్రిళ్లు పని చేస్తూనే ఉన్నారు. రాత్రి కుట్టడం దోషం అనే భావనతో పని మానుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.
రాత్రి కుట్టకూడదు అంటారెందుకు?
teluguLifestyle Editor
1:43:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.