బరువు తగ్గడానికి సైక్లింగ్ ఓకే...దీని వల్ల ఉపయోగాలు

బరువు తగ్గించుకోడానికి సైక్లింగ్ ఉపయోగకరమైన వ్యాయామం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... 

-  మీ క్యాలరీలను సైక్లింగ్ ద్వారా బర్న్ చేయడం వల్ల కొవ్వును తేలిగ్గా వదిలించుకోగలరు. ఇది మీరు కోరుకున్నట్లుగా బరువు తగ్గించుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంచుకోడానికి ఏకకాలంలో ఉపయోగపడుతుంది. 
- ఇది చాలా చవకగా లభ్యమయ్యే వ్యాయామం. 
- ఇది కాలి కండరాల్లో ప్రధానమైన క్వాడ్రిసెప్స్ (తొడ కండరాలు), గ్లూటీ (పిరుదు కండరాలు), హ్యామ్‌స్ట్రింగ్స్ (తుంటిభాగంలోని తొడకండరాలు), కాఫ్ (పిక్కలు) మజిల్స్ బలాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలాగే పూర్తి శరీర సామర్థ్యాన్నీ (ఓవరాల్ ఎండ్యూరెన్స్) సైక్లింగ్ పెంచుతుంది. 
- ఇతరత్రా కారణాల వల్ల మోకాళ్లపై బరువు పడటానికి వీల్లేని వారు ప్రత్యామ్నాయ వ్యాయామంగా సైక్లింగ్‌ను ఎంచుకోవచ్చు. 
- దీనికి ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సిన అవసరం లేదు. ఇవీ సైక్లింగ్‌తో ఉండే కొన్ని ఉపయోగాలు. 
ఇక మీరు ఎంత బరువు కోల్పోతారు, ఎంత కొవ్వును కరిగించుకోగలుగుతారు అన్న విషయం మీరు ఎంతసేపు సైక్లింగ్ చేస్తారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా ఒక అధ్యయన ఫలితం చెప్పాలనుకుంటున్నాను. రోజూ పది కిలోమీటర్ల లోపు లేదా అంతకంటే దగ్గరలో ఆఫీసులు ఉన్నవారిలో మూడో వంతు మంది కార్లకు బదులు సైకిళ్లను వాడటం మొదలుపెడితే ఇప్పుడున్న గుండె జబ్బుల్లో 10 శాతం తప్పక తగ్గుతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top