వేసవిలో అందంగా...

ఈ వేసవికాలంలో ఎంతో మంది ఎండకు తిరుగుతున్నప్పుడు అందవిహినంగా ఉన్నామని, ఎంతో దిగ్భ్రాంతి చెందుతుంటారు. అందంగా ఉండలనుకునే వారికి ఈ వేసవి లో సమస్యలు తప్పనిసరండోయ్‌...


ఇలాంటి సమస్యలనుంచి దూరంగా ఉండలాంటే మం చి కొన్ని నియమాలు పాటించాలి సుమా...
  • ఈ భగ భగ మండే ఎండల నుంచి తట్టుకునేందుకు తాజా పళ్లు మనకు మంచి ఆయుధాల్లాగా పని చేస్తాయి. అరోగ్యాన్ని, చర్మసంరక్షణకు తగిన ఉపశమనం కల్గిస్తుంది.
  • అంతేకాకుండా మీ చర్మానికి ఏలాంటి అలర్జీ వంటి లక్షణాలు లేనట్లయితే పళ్లు చర్మాన్ని బాగ శుబ్రపరిచి తాజాగా ఉంచగల్గుతుంది. చర్మ సంరక్షణకు పళ్లను వినియోగించే ముందు కింది సూచనలు పాటించాలి.
  • ఏదైనా బ్యూటీల గురించి సూచలను పాటిస్తున్నామంటే ముందుగా మొహాం చాలా శుభ్రంగా కడుక్కోవాలి.
  • కొంతమందికి పొడి చర్మం ఉంటుంది, వారు లైట్‌ క్రీమ్‌ ని పలుచగా రాయండి.
  • పొడి చర్మానికి కింది పళ్లను వాడవాచ్చు.
  • అప్రికాట్స్‌, ద్రాక్ష, అరటి, ఖర్బూ జా, రేగు పళ్ళు మొదలైనవి వాడవచ్చు. దీనికి కొంత కేరట్‌ రసాన్ని కూడా కలపవచ్చు. ఇది పొడి చర్మానికి అద్బు తంగా పని చేస్తుంది. జిడ్డు చర్మానికి
  • క్యాబేజి, టమాట. దోసకాయ, పుచ్చకాయ, కమలా పళ్ళు, ఇవి జిడ్డు, సాధారణ చర్మాలకుకూడా ఉపయుక్తంగా ఉంటాయి. మొహానికి పళ్ళ మాస్కులు వేసుకుంటున్నపుడు మెడని మర్చిపోవద్దు. మొహానికి తీసుకుంటున్న శ్రద్ధని మెడ విషయంలోనూ తప్పనిసరిగా తీసుకోవాలి.
  • తగినంత తేమనిచ్చే క్రీములు వాడాలి.
  • సరైన మాయిశ్చరైజర్‌ క్రీములు వాడకపోవటం వల్ల కూడా చర్మానికి చెమట మరింతగా పట్టే ప్రమాదం ఉంది. ఎక్కువ మాయిశ్చరైజర్‌ ఉన్న క్రీములు, నైట్‌క్రీములు వాడటం వల్ల చర్మం మరింత వేడెక్కుతుంది. మరింతగా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అందువల్ల తేమ అంతగాలేని వాటర్‌బేస్‌ మాయిశ్చరైజర్లు వాడటం మంచిది. ఇవి చర్మంపై జిడ్డుని మిగల్చకుండా లోపలికి ఇంకిపోయేలా చేస్తాయి. చల్లని నీటితో ముఖాన్ని తరచూ కడుగుతుండాలి.
  • పొడిచర్మానికి పులిసిన మీగడ, లేదా ఆలివ్‌, సన్‌ఫ్లవర్‌ లేదా ఆల్మండ్‌ ఆయిల్‌ని వాడవచ్చు. సాధారణ, జిడ్డు చర్మాలకు ఐస్‌ ముక్కలను వాడటం వల్ల చర్మంలో జిడ్డు తొలగుతుంది.
  • వేసవిలో హెార్బల్‌ ద్రవాలు కూడా బాగా పని చేస్తాయి. మొహాన్ని శుభ్రం చేసుకునేందుకు నీటిని బదులు వీటిని వాడవచ్చు. మూడుపాళ్ల లిండన్‌ బ్లూసమ్‌, రెండు పాళ్ల చమోమిల్‌ ఒకవంతు గులాబీ రేకులతో తయారైన మిశ్రమంతో మొహాన్ని కడుక్కోవచ్చు.
  • సూర్యకిరణాల తాకిడినుంచి రక్షించే సన్‌ ప్రొటక్షన్‌ ఫాక్టర్‌ ఉన్న సన్‌ స్క్రీన్‌ లోషన్లు ఎండలో బయటకి వెళ్లేముందు తప్పనిసరిగా వాడాలి. ఇవి చర్మ మృదుత్వాన్ని కాపాడి, చర్మానికి మెరుపునిస్తాయి. సన్‌ ప్రొటెక్షన్‌ ఫాక్టర్‌ 15 ఉన్న సన్‌స్క్రీన్‌ మాయిశ్చరైజర్‌ని వాడాలి.
  • బాగా ఎండలో తిరగవలసి వచ్చినపుడు సన్‌ ప్రొటెక్షన్‌ ఫాక్టర్‌ 30 ఉండేలా చూసుకోవాలి. బయటకి వెళ్లేముందు పదిహేాను నిముషాలు ముందుగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ని రాసుకోవాలి. ఇందువల్ల చర్మంలోకి అది భాగా ఇంకుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top