డయాబెటిస్ అదుపునకు మేలైన వైద్యం

మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత తయారైన చక్కెర రక్తంతో కలిసి ప్రయాణం చేస్తాయి. అలాంటి చక్కెరను శరీర కండరాల్లోకి చేర్చేందుకు ప్రత్యేక మార్గం ఉంటుంది. ఈ ప్రక్రియను పాంక్రియాస్ గ్రంధిలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ హార్మోన్ సహాయంతో చక్కెర రక్తం నుంచి కణజాలంలోనికి ప్రవేశిస్తాయి. తద్వారా శరీరంలోని ప్రతి కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. కొన్నిసార్లు పాంక్రియాస్ గ్రంధి వైఫల్యం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత విడుదల కానందున రక్తం లేని చక్కెర కణజాలంలోకి చేరక రక్తంలోనే నిలచి ఉంటుంది. అంత గాఢత ఉన్న రక్తం శుద్ధి చేయలేకపోతున్నానని, గాఢతను తగ్గించాలనే సంకేతాన్ని మెదడుకు పంపిస్తుంది. అందుకే మెదడు దాహంతో అధిక నీటిని తీసుకునేలా చేస్తుంది. అలా అధికంగా తాగిన నీటిని వడకట్టి బయటకు పంపాల్సి వస్తుంది. దీనివల్ల అధిక దాహం, అధిక మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

కారణాలు
వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం,గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వఉండే పచ్చళ్లు , తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది.


మధుమేహం రకాలు
టైప్ 1 మధుమేహం: కొందరిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. వీరికి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది.
టైప్ 2 మధుమేహం: వివిధ కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత కాదు. పాంక్రియాస్, ఇన్ఫెక్షన్స్ వల్లగాని, ఆహార నియమాలు సరిగా లేకపోవడం చేత, క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది.
గెస్టెషనల్ డయాబెటిస్: గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ,బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు.

లక్షణాలు
అధిక దాహం, అధికంగా ఆకలి, అధిక మూత్రవిసర్జన, దృష్టిలో మార్పు రావడం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, చర్మం, చిగుళ్లలో తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం, పుండ్లు ఆలస్యంగా మానడం, మానకపోవడం, తీవ్రమైన నీరసం, కంట్లో రెటీనా పొర మందగించడం మధుమేహ వ్యాధి లక్షణాలు.


ఇబ్బందులు
రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. తద్వారా కంటిలోని రెటీనా పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులు, నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల వివిధ భాగాల్లో తిమ్మిర్లు రావడం, స్పర్శ తగ్గిపోవడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్, చర్మసంబంధ వ్యాధులు వస్తాయి. సెల్యులైటిస్ వచ్చి పాదాలు, కాళ్లలో పుళ్లు పడే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఆ భాగం పూర్తిగా చెడిపోయి తీసివేయాల్సివస్తుంది.


వైద్యపరీక్షలు
సాధారణంగా తినకముందు రక్తంలోని చక్కెర శాతం, అలాగే భోజనం చేసిన రెండు గంటల తర్వాత రక్తంలోని చక్కెర శాతం ద్వారా రోగికి డయాబెటిస్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో నమ్మకం ఏర్పడటానికి హెచ్‌బిఏ, సి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా గడచిన మూడు నెలల చక్కెర శాతం సరాసరి తెలుసుకోవచ్చు. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ద్వారా కూడా నిర్ధారించవచ్చు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సరైన ఆరోగ్య నియమావళి పాటించటం, అధిక చక్కెర నిల్వ పదార్థాలు, తీపి పదార్థాలు, కొన్ని రకాల పండ్లు అరటి, సపోట, ఆపిల్ తీసుకోకూడదు. సరైన సమయానికి భోజనం తీసుకోవడం, సమయపాలన పాటించడం మంచిది. రోజూ గంట వ్యాయామం చేయడం, 45 నిమిషాల నడక సాగించాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. పాదాలకు ఇన్ఫెక్షన్‌లు రాకుండా మెత్తటి చెప్పులు వాడాలి. శుభ్రత పాటించాలి.

హోమియో వైద్యం
రోగి యొక్క మానసిక శారీరక లక్షణాలను అనుసరించి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆసిడ్‌ఫాస్, యురెనియం నైట్రికమ్, ఇన్సులిన్ 6 సి, నైజీజీయం, జీమ్మినియ, సెపాలండ్రా మందులు ఉపయోగపడతాయి. ఈ మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడటం మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top