బ్రెడ్ పాన్ కేక్

కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు          - 10;
పాలు                    - ఒక కప్పు
ఉల్లితరుగు             - అర కప్పు;
క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
టొమాటో తరుగు    - పావు కప్పు;
బంగాళదుంప తురుము - అర కప్పు;
పచ్చిమిర్చి            - టేబుల్ స్పూన్;
అల్లంతురుము       - టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు     - 2 టేబుల్ స్పూన్లు;
ఉప్పు            -తగినంత
కారం            - అర టీ స్పూను;
గరంమసాలా - అర టీ స్పూను
నూనె           - సరిపడా

తయారుచేసే పద్ధతి:
బ్రెడ్‌స్లైసుల అంచులను తీసేసి, బ్రెడ్‌ను పొడిలా చేసి, అర కప్పు పాలలో పదినిముషాలు నానబెట్టాలి.పాలు తప్ప మిగిలిన వస్తువులన్నీ ఒక గిన్నెలో వేసి, నూనె కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి.పాలు జతచేసి దోసె మిశ్రమంలా తయారుచేయాలి కొద్దిగా జిగురుగా ఉండాలి. లేదంటే మరీ మెత్తగా అయిపోయి, సరిగా రావు.స్టౌ మీద పాన్ ఉంచి, వేడయ్యాక నూనె రాయాలి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పెనం మీద వేసి, దోసె మాదిరిగా కొద్దిగా మందంగా వేయాలి. గోధుమరంగులోకి మారాక రెండవవైపు తిప్పి కాలనివ్వాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top