మనం తీసుకునే ఆహార పదార్థాలలో అన్ని రకాల పోషక విలువలుండే ఆహార పదార్థాలుంటాయి. ఇవి శరీర సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇందులో ప్రధానంగా పెరుగుకూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో చాలా రకాల లాభాలున్నయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగులో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పూసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే శరీర చర్మం మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు పెరుగు దట్టించి తలస్నానం చేస్తే కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. పెరుగులో బేసన్ కలిపి నలుగుపిండిలాగా శరీరానికి పూస్తే శరీరంలో పేరుకుపోయిన మలినాలు మటుమాయమవుతాయి. పెరుగులో తేనెను కలిపి వెంట్రుకలకు పూస్తే ఇది కండీషనర్‌లాగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి శరీర చర్మంపై పూస్తే ఇది క్లీజింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
అందానికి అందం, పెరుగుతో మీ సొంతం
teluguLifestyle Editor
3:02:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.