పార్టీ మేకప్ చెదరకుండా ఉండాలంటే...

పార్టీలకు మహిళలు ఎంతో ఫ్రెష్‌గా తయారై వెళ్తారు. అయితే ఆ తాజాదనం ఒక్కో గంట గడిచే కొద్దీ క్రమంగా చెదిరిపోతూ ఇబ్బంది పెడుతుంటుంది. మీ మేకప్‌ చెదిరిపోకుండా మీరు ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. 

మీ బ్యాగులో కాంపాక్ట్ ఉంచుకుంటే అవసరమయినప్పుడు ఇబ్బంది లేకుండా టచప్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే ప్రెస్డ్ పౌడర్‌తో ఫౌండేషన్ సెట్ చేసుకుంటే మేకప్ అలానే ఉంటుంది.

ఐ షాడో చెదిరిపోకుండా ఉండాలంటే ఐ క్రీమ్‌ను కంటి కింద భాగానికి పరిమితం చేయాలి. ఇలా చేస్తే కనురెప్పలపై అదనపు తేమ ఉండకుండా ఉంటుంది. న్యూట్రల్ లిప్ పెన్సిల్‌తో పెదవులకు కలర్ అద్ది లిప్ గ్లాస్ వేసుకున్నట్లయితే లిప్ గ్లాస్ ఫేడైనా వెనుక ఉన్న రంగు అలానే ఉంటుంది. అదేవిధంగా పెదవులపై ఫౌండేషన్ అప్లై చేసినట్లయితే లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top