జుట్టు పట్టులా మెరవాలంటే ఇలా చేయండి...

పని ఒత్తిడీ, కాలుష్యం ఇతరత్రా కారణాలు జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే అందుబాటులో ఉండే పండ్లతో హెయిర్ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు. 

* జుట్టు పొడిబారిన్పుడు అరటిపండూ, రెండు కప్పుల బొప్పాయి ముక్కలూ, పావుకప్పు అనాస ముక్కల్ని గుజ్జుగా చేసుకోవాలి. దానికి చెంచా ఆలివ్ నూనె కలిపి మొత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని తలకు పూతలా వేసుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. నలభై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే తగిన తేమ అంది వెంట్రుకలు నిగనిగలాడతాయి.

* జిడ్డు సమస్య బాధిస్తుంటే ఒక కప్పు కమలాఫలం రసం, ఒక కప్పు పెరుగూ, చెంచా కలబంద రసం, టేబుల్ స్పూన్ శెనగపిండి వేసి మొత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. కుదుళ్లు మొదలుకొని చివర్ల వరకూ రాసుకొని పావుగంచాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే జిడ్డు తొలగిపోతుంది.

* రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి రసం, చెంచా ద్రాక్షరసం, టేబుల్ స్పూన్ కొబ్బరిపాలూ, రెండు చెంచాల మందారపొడి కలిపి తలకు రాసుకోవాలి. గంటయ్యాక శుభ్రపరుచుకుని షాంపూతో తలస్నానం చేస్తే తలకు కండిషనింగ్ అందుతుంది. చుండ్రు సమస్య దూరమవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top