మొటిమలకు చెక్ పెట్టాలా..? అయితే పొటాటో ప్యాక్ వేసుకోండి!

మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నారా? అయితే నేచురల్‌గా లభించే బంగాళాదుంపను సౌందర్య సాధనంగా ఎంచుకోండి. మీ చర్మ సౌందర్యం మరింత మెరుగవ్వాలంటే.. బంగాళాగదుంప జ్యూస్, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని, అందులో తేనె చేర్చి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుంది.

అలాగే మీ చర్మం పొడిబారినట్లైతే బంగాళాదుంప గుజ్జులో రెండు స్పూన్ల మిల్క్ పౌడర్, 2 స్పూన్ల బాదం ఆయిల్ చేర్చి ఆ పేస్టును ముఖానికి పట్టించి.. 25 నిమిషాల తర్వాత కడిగేయండి.

* బంగాళాదుంపను పేస్ట్ చేసి అందులో 23 టేబుల్ స్పూన్ల ఆపిల్ జ్యూస్ చేర్చి చర్మానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. 


* మీ చర్మం మిలమిల మెరిసిపోవాలంటే.. ముల్తానీ మట్టి, నిమ్మరసం, బంగాళాదుంప గుజ్జును సమానంగా తీసుకుని పేస్ట్‌లా తయారుచేసి ముఖానికి పట్టించి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. తర్వాత మాశ్చరైజర్ క్రీమ్ పూయాలి. ఇలా రోజూ చేస్తే మొటిమలకు చెక్ పెట్టవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top