చర్మం నిగారింపు కోసం ఏం చేయాలి..

చర్మ సౌందర్యానికి మహిళలు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. ఇందుకోసం వారు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇలా ప్రయోగాలు చేసే మహిళలు.. ఇంట్లోనే ఉంటూ చిన్నపాటి చిట్కాలు పాటిస్తే అందంగానే కాకుండా ఆరోగ్యంగాను ఉంటారని ఆరోగ్యనిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుందని వారు చెపుతున్నారు.

ముఖ్యంగా పొడిబారిన చర్మం కలవారు అరటిపండు, తేనె, పెరుగుతో కూడిన మిశ్రమాన్ని కలిపిన పేస్ట్‌ను ముఖానికి పూసి 15 నిమిషాలపాటుంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసినట్టయితే చర్మం గతంలోకన్నా మెరుగ్గా తయారవుతుందని బ్యుటీషియన్లు చెపుతున్నారు.

అలాగే, ముఖం జిడ్డుగా ఉన్నట్టయితే విటమిన్ సి కలిగిన పండ్లతో తయారు చేసిన గుజ్జును ముఖానికి పూస్తే మంచి ఫలితం లభిస్తుందని చెపుతున్నారు. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలు లేదా నీటిలోగానీ కలపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు మటుమాయం అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటే పిగ్మెంటేషన్ లేదా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి గాను ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగినట్టయితే సమస్యకు పరిష్కారమవుతుందని చెపుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top