నోటి దుర్వాసనను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు

నోటి దుర్వాసనను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.


నోటి దుర్వాసన రాకుండా ఉండటానికి ఎన్నో చిట్కాలను ప్రయత్నించిన ఎటువంటి ఫలితం ఉండదు. చాలా మంది టూత్ పేస్టులు మారుస్తూ ఉంటారు. అయినా ఎటువంటి ప్రయోజనం కనపడదు. అసలు నోటి దుర్వాసన కలిగించే పదార్ధాలు,నోటి దుర్వాసనతగ్గించే పదార్ధాల గురించి వివరంగా తెలుసుకుందాం.
నోటి దుర్వాసనకు కారణం అయిన పదార్ధాలు
వెల్లుల్లి
ఉల్లిపాయ
కాఫీ
ఆల్కహాల్
నాన్-వెజ్
పంచదార
చీస్
ముల్లంగి
టమాటా
ఈ పదార్ధాల వలన కొత్తగా దుర్వాసన రావడమే కాదు... ఉన్న దుర్వాసన ఎక్కువ కూడా అవుతుంది. అందుకే ఈ పదార్థాలు తినే అలవాటు ఉన్నప్పుడు వెంటనే తగ్గించుకోవాలి. అప్పుడప్పుడు తినవచ్చు. అయితే నలుగురితో కలిసే ముందే వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది.
ఇప్పుడు నోటి దుర్వాసనను తగ్గించే పదార్థాలు ఏంటో చూద్దాం:
ఆపిల్ (గ్రీన్ ఆపిల్ కూడా)
తులసి ఆకు
పుదీనా
అల్లం
పాలకూర
లేట్యుస్
పుచ్చకాయ
చెక్క
గ్రీన్ టీ
సోంపు
నీరు
పాలు
విటమిన్-C ఉన్న పండ్లు
ఈ పదార్థాలను మీరు రోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి. నోటి దుర్వాసన ఉంటె తగుముఖం పడుతుంది. అంతేకాక దుర్వాసన రాకుండా కూడా సహాయాపడతాయి.
1 2 3
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top