మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలియని విషయాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ అంటే దాదాపుగా అందరికి తెలుసు. టాలీవుడ్ లో ఈ జంటను బెస్ట్ కపుల్ గా చెప్పవచ్చు. ముంబై అమ్మాయి అయిన నమ్రత మహేష్ తో వివాహం అయ్యాక తెలుగు నేర్చుకుంది. 

అంతేకాక పెళ్లి అయ్యాక సినిమాలు మానేసి ఇంటిని చక్కదిద్దుకుంటుంది. అలాంటి నమ్రత గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

CLICKHERE : నాగార్జున‌కు త‌ల‌నొప్పిగా మారిన కొడుకులు

నమ్రత మహారాష్ట్రియన్ కుటుంబంలో పుట్టింది నిజమే కానీ… ఆమె పూర్వీకులు మాత్రం గోవన్(గోవా ప్రాంతం) మూలాలు కలిగిన వారు. 


మహేష్ బాబు తన తండ్రి కృష్ణ వారసత్వం పుచ్చుకున్నట్లే… నమ్రత కూడా తన గ్రాండ్ మదర్, ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్ వారసత్వం పుచ్చుకుంది. స్వాతంత్రానికి ముందు(1938) వచ్చిన బ్రహ్మచారి చిత్రంలో మీనాక్షి నటించింది. నమ్రత అక్కయ్య శిల్ప శిరోద్కర్ కూడా నటిగా ఇంకా కొనసాగుతోంది.

CLICKHERE : టాలీవుడ్ హీరోల మేనరిజమ్స్

చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే.... నమ్రత వయసులో మహేష్ బాబు కంటే పెద్దది. నమ్రత జనవరి 22, 1972లో జన్మిస్తే, మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో జన్మించారు. అంటే ఇద్దరి మధ్య వయస్సు మూడేళ్లకుపైగా తేడా ఉంది.

CLICKHERE : ఇబ్బందులు పెట్టే 'గ్యాస్' స‌మ‌స్య పోవాలంటే ...

మొదట నమ్రత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి 1993లో మిస్ ఇండియా కిరీటంను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇండియా తరుపున మిస్ యూనివర్శ్ పోటీల్లో పాల్గొన్న సరే విశ్వ సుందరి కిరీటం మాత్రం దక్కలేదు. ఐదవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

మిస్ ఇండియా కిరీటం గెలిచాక బాలీవుడ్ అవకాశాలు క్యూ కట్టాయి. మొదట ఆమె నటించిన సినిమా ‘పురబ్ కి లాలియా పశ్చిమ్ కి చాలియా’. అయితే అది విడుదల కాలేదు. 

CLICKHERE : "ముకేశ్ అంబానీ"కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే


నమ్రత కెరీర్ లో "వాస్తవ్" సినిమా హిట్ అయింది. దాంతో వరుస అవకాశాలు రావటంతో దాదాపుగా 20 హిందీ సినిమాలు చేసింది.

2004లో మహేష్ బాబుతో 'వంశీ' సినిమాలో నటించిన నమ్రత… ఈ సినిమా సమయంలో అతనితో ఏర్పడిన పరిచయంతో ప్రేమలో పడింది.

ఇద్దరూ కలిసి దాదాపుగా ఐదేళ్లు డేటింగ్ చేసారు. అయితే వీరి పెళ్లికి మహేష్ బాబు వైపు నుండి అభ్యంతరాలు ఏర్పడటంతో….. పెద్దలను ఎదిరించిన మహేష్ బాబు ముంబైలో నమ్రతను వివాహం చేసుకున్నాడు. 

CLICKHERE : పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి

పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం నమ్రత-మహేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు. అటు ఇంటి బాధ్యతలతో పాటు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన పనులు, తమ సొంత ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుంటూ మహేష్ బాబుకు చాల సపోర్టుగా ఉంటోంది నమ్రత.

CLICKHERE : రాజమౌళి రెమ్యునరేషన్ చూస్తే గుండె గుభేల్...

CLICKHERE : నెల రోజుల పాటు మట్టికుండలో నీటిని త్రాగితే అద్బుతమైన ఫలితాలు

CLICKHERE : కమెడియన్ కోవై సరళ గురించి తెలియని చేదు నిజాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top